MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇక మహేష్ బాబు సినిమా పని మొదలెట్టిన రాజమౌళి, హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ...?

ఇక మహేష్ బాబు సినిమా పని మొదలెట్టిన రాజమౌళి, హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ...?

ట్రిపుల్ ఆర్ హడావిడి అయిపోయింది.. ఇక నెక్ట్స్ సినిమా పై దృష్టి పెట్టాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న జక్కన్న.. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 08 2022, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇక మహేష్ బాబు  సినిమా కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నాడట రాజమైళి. ముఖ్యంగా మహేష్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం చాలా ఆప్షన్లు తీసుకున్నాడట. అందులో ఎవరు అయితే బాగుంటారా అని  చూస్తున్నాడట. లిస్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఉన్నట్టు తెలుస్తోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుబోతున్న పాన్ ఇండియా సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఫిక్సైన ప్రాజెక్ట్ కూడా ఒకటి. గత కొన్నేళ్ళుగా ఈ సినిమాకోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. దేశమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

37

దాదాపు పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న  సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

47

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్  సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్‌ను మళ్ళీ తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం తన దృష్ఠి మొత్తం మహేశ్ సినిమా మీదే పెట్టారు. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్నారట. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి బృందం ఉన్నట్టు తెలుస్తోంది. 

57

సాహో  సినిమాతో టాలీవుడ్‌కి  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాకపూర్‌. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్  హీరోగా నటించిన ఈ మూవీ ఒక్క బాలీవుడ్‌లో తప్ప మిగతా భాషలలో నిరాశపరిచింది. శ్రద్ధాకపూర్ హిందీలో మంచి క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కానీ, మళ్ళీ తెలుగులో అవకాశాలు దక్కలేదు ఆమెకు. 

67

ఇక ఇప్పుడు  ఏకంగా మహేశ్-రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇది పూర్తయ్యాక రాజమౌళి సినిమా ఉంటుంది.

77

త్రివిక్రమ్ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. దాదాపు ఈ ఇయర్ ఎండ్ వరకూ   జక్కన్న సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Recommended image2
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved