MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ కోసం పూనకం వచ్చినట్లు పాడిన శృతి హాసన్.. గ్లోబ్ ట్రాటర్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

మహేష్ కోసం పూనకం వచ్చినట్లు పాడిన శృతి హాసన్.. గ్లోబ్ ట్రాటర్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ పాటని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడారు. తన అద్భుతమైన గాత్రంతో శృతి హాసన్ మెస్మరైజ్ చేస్తోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 10 2025, 09:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ మూవీ
Image Credit : Asianet News

మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. నవంబర్ 15న ఈ సినిమాకి సంబంధించిన బిగ్ రివీల్ ఉండబోతోందని ఆల్రెడీ ప్రకటించారు. 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ లో ఈ రివీల్ ఉండబోతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం గ్లోబ్ ట్రాటర్ చిత్రం నుంచి అప్డేట్స్ ఉంటాయని రాజమౌళి ప్రకటించారు. 

25
కుంభ ఫస్ట్ లుక్
Image Credit : Asianet News

కుంభ ఫస్ట్ లుక్

చెప్పినట్లుగానే ముందుగా ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నెటిజన్లలో ఈ లుక్ కి సంబంధించిన మిక్స్డ్ రియాక్షన్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ సర్ప్రైజ్ ని రాజమౌళి ఇచ్చారు.

Related Articles

Related image1
మాస్ సినిమాకి సుద్దపూసలా గెటప్, ఇంట్లో ఉన్న పాత బనియన్ చించేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
Related image2
ఈ ముగ్గురిలో చిరంజీవి, ప్రభాస్ సినిమాలని దెబ్బ కొట్టే హీరో ఎవరు.. మహేష్ బాబు పరిస్థితి ఏమైందో చూశారుగా
35
ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
Image Credit : Asianet News

ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ పాటని పాడింది ఎవరో కాదు..స్టార్ హీరోయిన్ శృతి హాసన్. శృతి హాసన్ మల్టీట్యాలెంటెడ్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఆమెకి మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. గతంలో చాలా సినిమాల్లో పాటలు పాడింది. గ్లోబ్ ట్రాటర్ మూవీలో సంచారి అంటూ సాగే పాటని శృతి హాసన్ పాడింది. తన గాత్రంతో శృతి హాసన్ మెస్మరైజ్ చేస్తోంది. 

45
గూస్ బంప్స్ తెప్పించే లిరిక్స్
Image Credit : Asianet News

గూస్ బంప్స్ తెప్పించే లిరిక్స్

మహేష్ బాబు వీరత్వాన్ని వర్ణిస్తూ ఈ పాటని రాశారు. ఈ పాటకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగే లే.. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగే లే, రారా వీరా ధృవ తారా సంచారా  అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

55
పూనకం వచ్చినట్లు పాడిన శృతి హాసన్ 
Image Credit : Asianet News

పూనకం వచ్చినట్లు పాడిన శృతి హాసన్ 

శృతి హాసన్ లీనమైపోయి పూనకం వచ్చినట్లు ఈ పాటని పాడుతోంది. ఆ దృశ్యాలు లిరికల్ వీడియోలో ఉన్నాయి. ఈ మూవీలొ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం
Recommended image3
అభిమానులకు పెళ్లి గిఫ్ట్? విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఎంత పెద్ద సాయం చేశాడో తెలుసా? !
Related Stories
Recommended image1
మాస్ సినిమాకి సుద్దపూసలా గెటప్, ఇంట్లో ఉన్న పాత బనియన్ చించేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
Recommended image2
ఈ ముగ్గురిలో చిరంజీవి, ప్రభాస్ సినిమాలని దెబ్బ కొట్టే హీరో ఎవరు.. మహేష్ బాబు పరిస్థితి ఏమైందో చూశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved