MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లోయింగ్ గెటప్ లో ఫారెన్ నుంచి దిగిన మహేష్..రాజమౌళితో కలసి త్వరలో ప్రెస్ మీట్ ?

మైండ్ బ్లోయింగ్ గెటప్ లో ఫారెన్ నుంచి దిగిన మహేష్..రాజమౌళితో కలసి త్వరలో ప్రెస్ మీట్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. రాజమౌళి ప్రతి విషయంలో చాలా టైం తీసుకుంటారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2024, 09:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. రాజమౌళి ప్రతి విషయంలో చాలా టైం తీసుకుంటారు. స్క్రిప్ట్ రెడీ చేయడం దగ్గరి నుంచి.. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు, హీరో గెటప్ ఫిక్స్ చేయడం.. వర్క్ షాప్ లు ఇలా ప్రతి అంశంలో రాజమౌళి తనదైన మార్క్ ప్రదర్శిస్తూ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అందుకే జక్కన్న ఆలస్యం అయినప్పటికీ 100 శాతం ఫలితాలు సాధిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను చేయబోయే చిత్రం మహేష్ బాబుతో అని జక్కన్న ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ గా రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రం జరుగుతున్నాయి. 

36

విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం గురించి ఆల్రెడీ కొన్ని హింట్స్ ఇచ్చారు. అయితే ఫైనల్ స్క్రిప్ట్ లో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు ఉంటాయో లేవో నమ్మకం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభానికి ముందు కూడా విజయేంద్ర ప్రసాద్ ఇందులో రెజ్లింగ్ ఉంటుందని చెప్పారు. కానీ ఆర్ఆర్ఆర్ లో రెజ్లింగ్ ప్రస్తావనే లేదు. 

46

అయితే ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా మాత్రం మహేష్ కనిపిస్తాడని రాజమౌళి కంఫర్మ్ చేశారు. ఈ చిత్ర షూటింగ్, ఇతర కార్యకలాపాల కోసం రాజమౌళి హైదరాబాద్ నగర శివారులో ఉండే అల్యూమినియం ఫ్యాక్టరీ భూమిని 9 ఎకరాలు లీజుకి తీసుకున్నారు. ఇంత వేగంగా ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నా రాజమౌళి, మహేష్ మీడియా ముందుకు మాత్రం రావడం లేదు. 

56

మహేష్ బాబు వరుస ఫారెన్ టూర్లతో బిజీగా ఉన్నారు. కాగా మహేష్ ఫారెన్ టూర్ ముగించుకుని ఫ్యామిలీతో సహా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. మహేష్ బాబు లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. లాంగ్ హెయిర్ తో పాటు గడ్డం కూడా స్టైలిష్ గా ఉంది. రాజమౌళి చిత్రానికి మహేష్ బాబు లుక్ ఇదే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. 

66
Rajamouli

Rajamouli

మహేష్ ఫారెన్ నుంచి తిరిగొచ్చాడు కాబట్టి అతి త్వరలోనే రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలు వివరించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. మహేష్ బాబు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. రాజమౌళి ఎలాంటి కథ తీయబోతున్నారో అని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved