- Home
- Entertainment
- మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హీరోయిన్ రీ ఎంట్రీ, ఇద్దరు పిల్లల తల్లి అయినా తగ్గేది లేదంటున్న గోవా బ్యూటీ.
మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హీరోయిన్ రీ ఎంట్రీ, ఇద్దరు పిల్లల తల్లి అయినా తగ్గేది లేదంటున్న గోవా బ్యూటీ.
టాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హీరోయిన్, మహేష్, బాబు ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బ్యూటీ. సడెన్ గా సినిమాలు మానేసి ఇద్దరు బిడ్డల తల్లిగా మారిన తార, రీఎంట్రీ తప్పక ఇస్తాన్న హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం?

ఒకప్పుడు టాలీవుడ్‌ను తన అందం, అభినయంతో మాయ చేసిన గోవా బ్యూటీ ఇలియానా రీసెంట్ గా తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా, తాను నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో రీఎంట్రీ ఇస్తానని వెల్లడించారు. నటి నేహా ధూపియాతో జరిగిన లైవ్ ఇంటరాక్షన్‌లో పాల్గొన్న ఇలియానా, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ , తల్లిగా తన జీవితం ఎలా ఉంది అనే విషయంపై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. ప్రస్తుతం తాను తన ఇద్దరు పిల్లలతో పూర్తి సమయం గడుపుతున్నట్లు చెప్పారు.
ఇలియానా మాట్లాడుతూ "సినిమాల్లోకి తిరిగి రావాలనే తపన నాలో ఉంది. కెమెరా ముందు నటించడం, మంచి వ్యక్తులతో కలిసి పనిచేయడం, సెట్స్‌లో గడిపే సమయం all of that I really miss. కానీ ప్రస్తుతం నా జీవితం మొత్తం నా ఇద్దరు పిల్లల చుట్టూ తిరుగుతోంది. వాళ్లకి నేను అవసరం అవుతున్న ఈ సమయాన్ని పూర్తిగా వారి కోసం కేటాయించాలనిపించింది. అందుకే తాత్కాలికంగా నటనకు బ్రేక్ ఇచ్చాను" అని ఆమె తెలిపారు.
ఇలియానా ప్రస్తుతం తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, హూస్టన్ నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ 2023 ఆగస్టు 1న జన్మించగా, రెండవ కుమారుడు కియాను రఫే డోలన్ ఈ ఏడాది 2025 జూన్ 19న జన్మించాడు. తల్లితనంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడిన ఇలియానా, "చాలాసార్లు నాకు నేను తల్లి పాత్రను సరిగ్గా పోషించగలనో లేదో అనే అనుమానం వచ్చేది. కానీ ఆ భావనలు మామూలే అని తర్వాత అర్థమయ్యింది" అని చెప్పుకొచ్చారు.
తెలుగులో ఇలియానా ‘దేవదాస్’, ‘పోకిరి’, ‘జల్సా’, ‘రాఖీ’, ‘కిక్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఇలియానా. అక్కడ ఆమె ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’, ‘రుస్తుం’, , ‘బాద్‌షాహో’ వంటి సినిమాల్లో నటించారు. చివరిసారిగా ఆమె 2024లో విడుదలైన హిందీ సినిమా ‘దో ఔర్ దో ప్యార్’లో కనిపించారు. తెలుగులో ఆమె చివరిసారి రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో కనిపించారు. కానీ ఈసినిమా డిజాస్టర్ అయ్యింది.