MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pokiri Lift Scene: పోకిరిలో ఇలియానాతో లిఫ్ట్ సీన్, మహేష్ బాబు బాగా ఎంజాయ్ చేశాడట.. కారణం ఇదే

Pokiri Lift Scene: పోకిరిలో ఇలియానాతో లిఫ్ట్ సీన్, మహేష్ బాబు బాగా ఎంజాయ్ చేశాడట.. కారణం ఇదే

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ పోకిరి. ఈ చిత్రంలో మహేష్ బాబు తనకు బాగా ఇష్టమైన సన్నివేశం గురించి మాట్లాడారు. అదే విధంగా ఇలియానాతో లిఫ్ట్ సీన్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 08 2026, 07:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu
Image Credit : Asianet News

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ ని పీక్ కి తీసుకెళ్లిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అసాధారణంగా రికార్డులు నెలకొల్పింది. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరికి ముందు మహేష్ వేరు.. పోకిరి నుంచి అభిమానులు చూసిన మహేష్ వేరు అనే చెప్పాలి. పోకిరి మూవీలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ మొత్తం డైరెక్టర్ పూరి జగన్నాధ్ మార్చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ కి ఇష్టమైన సీన్
Image Credit : Facebook

మహేష్ కి ఇష్టమైన సీన్

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు ఐపీఎస్ అధికారి అని రివీల్ చేసే సన్నివేశం అయితే గూస్ బంప్స్ తెప్పించింది. మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో పోకిరి మూవీలో తనకు బాగా ఇష్టమైన సన్నివేశం గురించి మాట్లాడారు. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్, నాజర్ మధ్య వచ్చే సీన్ తన ఫేవరెట్ అని మహేష్ అన్నారు. అన్ని సినిమాల్లో అలాంటి ఎమోషన్ ఉన్న సన్నివేశం కుదరదు అని మహేష్ తెలిపారు.

35
ఇలియానా డెడికేషన్ ఉన్న నటి
Image Credit : Prime Video

ఇలియానా డెడికేషన్ ఉన్న నటి

ఇలియానా గురించి కూడా మహేష్ స్పందించారు. ఇలియాన్ డెడికేషన్ ఉన్న నటి. పోకిరి తర్వాత ఆమె చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటుంది అని మహేష్ అన్నారు. హీరోయిన్ తో వచ్చే సన్నివేశాల గురించి యాంకర్ ప్రశ్నించారు. ఇలియానాతో వచ్చే సన్నివేశాలు కొన్ని ఎమోషనల్ గా, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. లిఫ్ట్ సీన్ అయితే ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. దాని గురించి ఏమంటారు అని ప్రశ్నించగా మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.

45
లిఫ్ట్ సీన్ లో బాగా ఎంజాయ్ చేశా
Image Credit : instagram

లిఫ్ట్ సీన్ లో బాగా ఎంజాయ్ చేశా

లిఫ్ట్ సీన్ చేస్తున్నప్పుడు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అందులో రియల్ ఎమోషన్ ఉంది. అది సినిమాలో జరుగుతున్న సీన్ లా ఉండదు. ఒక అబ్బాయి, అమ్మాయి అనుకోకుండా షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం అనేది ఎక్కడైనా జరగొచ్చు అని మహేష్ బాబు అన్నారు.

55
ఇప్పుడు డ్యాన్స్ లేదు అంతా ఎక్సర్సైజ్ లే..
Image Credit : mahesh babu instagram

ఇప్పుడు డ్యాన్స్ లేదు అంతా ఎక్సర్సైజ్ లే..

ఈ మూవీలో కామెడీ కంటే పూరి జగన్నాధ్ గారు రాసిన డైలాగులు అద్భుతం. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా లాంటి డైలాగ్స్ ని చాలా ఎంజాయ్ చేశాను అని మహేష్ తెలిపారు. పోకిరిలో కొరియోగ్రాఫర్ రాజు సుందరం రియల్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఏది అవసరమో అదే చేశారు. అందుకే సాంగ్స్ లో అంతబాగా కనిపించాను. చివర్లో మాస్ సాంగ్ కి లుంగీ అవసరం. అందుకే లుంగీ వేయించారు. నాకు రియల్ గా డ్యాన్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే ఇటీవల చూస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ డ్యాన్స్ చేస్తున్నట్లు లేవు.. ఏదో ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు ఉంటున్నాయి అని మహేష్ సెటైర్లు వేశారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image2
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image3
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Related Stories
Recommended image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved