- Home
- Entertainment
- 6,817 కి.మీ ప్రయాణం! ఆస్ట్రేలియా నుంచి గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కు వచ్చిన మహేశ్ బాబు ఫ్యాన్స్
6,817 కి.మీ ప్రయాణం! ఆస్ట్రేలియా నుంచి గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కు వచ్చిన మహేశ్ బాబు ఫ్యాన్స్
Globetrotter event : ఆస్ట్రేలియా పెర్త్ నుంచి 6,817 కి.మీ.. 12 గంటలు ప్రయాణించి ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌కు వచ్చారు మహేశ్ బాబు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు.

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ.. పెర్త్ నుంచి వచ్చారు !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుంచి హైదరాబాద్ వరకు 6,817 కి.మీ దూరం.. కేవలం మహేశ్ బాబును చూడాలనే కోరికతో హైదరాబాద్ కు వచ్చారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా 12 గంటల ప్రయాణం చేసి నగరానికి చేరుకున్నానని చేసిన పోస్టు వైరల్ గామారింది.
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వచ్చారు. కానీ, ఒక అభిమాని అంత దూరం నుంచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పెర్త్ వీధుల నుంచి RFC వరకు సాగిన తన ప్రయాణాన్ని సునీల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.
సునీల్ అవుల పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం
సునీల్ చేసిన పోస్ట్‌లో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు, ప్రత్యేక గ్లోబ్‌ట్రాటర్ పాస్‌పోర్ట్, ఫ్లైట్ డిటైల్స్ ఉన్నాయి. తన పోస్టులో “12 hours of flight and 6817 kms from the streets of Perth to RFC Hyderabad. #JaiBabu #GlobeTrotter” అంటూ పేర్కొన్నాడు. ఇది మహేశ్ బాబు అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. వేలాది లైక్‌లు, షేర్‌లు, కామెంట్లు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. సునీల్ చేసిన ఈ ప్రయాణం కేవలం ఒక ఫ్యాన్ మూమెంట్ మాత్రమే కాదు, మహేశ్ బాబు గ్లోబల్ క్రేజ్ ఎంతదో స్పష్టంగా చూపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కార్తికేయ స్పందనతో రెట్టింపు వైరల్
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ పోస్ట్‌పై స్పందించడంతో ఇది సోషల్ మీడియాలో సునామీ రేపింది. “ఒక్కడే తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్. Sky also not the limit.” అనే కార్తికేయ మాటలు అభిమానుల్లో సంబరాలు రేకెత్తించాయి. ఈ స్పందనతో సునీల్ పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్ కమ్యూనిటీలో రచ్చ లేపింది.
After 12hr of flight and 6817 kms from streets of Perth to RFC Hyderabad. #JaiBabu@urstrulyMahesh#GlobeTrotter day. pic.twitter.com/eWZzlwg5gB
— Sunil Avula (@avulasunil) November 15, 2025
మహేశ్ బాబు గ్లోబల్ స్టార్డమ్‌కు ఇదే సాక్ష్యం
ఈ ఫ్యాన్స్ ప్రయాణం మహేశ్ బాబు అంతర్జాతీయ స్థాయి మార్కెట్, పాపులారిటీకి మరో నిదర్శనం. ప్రత్యేకించి విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల్లో మహేశ్ సినిమాలకు క్రేజ్ ను ఇది చూపిస్తుంది. అందుకే మహేష్ సినిమాలు ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లను సాధిస్తాయి. సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా, యూకే వంటి దేశాల నుంచి కూడా అభిమానులు ఈ ఈవెంట్‌కు రావడం టాలీవుడ్‌లో అరుదైన సంఘటనగా నిలిచింది.