MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మొదటి 5 నిమిషాల్లోనే రాజమౌళి షాక్.. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్

మొదటి 5 నిమిషాల్లోనే రాజమౌళి షాక్.. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్

Varanasi Movie : గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వారణాసి సినిమా కథ వినగానే ఆశ్చర్యపోయానని అన్నారు. ఐదు నిమిషాల్లోనే షాక్ కూడా అయ్యానని చెప్పారు. సినిమాలో తన విలన్ పాత్రపై ప్రత్యేక అనుభవాలను పంచుకున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 15 2025, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్
Image Credit : varanasi event

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ శనివారం ఫుల్ జోష్ లో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ వారాణాసి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది. ఈ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇండస్ట్రీలో పాతికేళ్లుగా నటిస్తూ పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పృథ్వీరాజ్, ఇంత అద్భుత స్థాయిలో సినిమా లాంచ్‌ను ఎన్నడూ చూడలేదని తెలిపారు. వేదికపై ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజమౌళి నరేషన్ మొదటి ఐదు నిమిషాల్లోనే పృథ్వీరాజ్ షాక్
Image Credit : Asianet News

రాజమౌళి నరేషన్ మొదటి ఐదు నిమిషాల్లోనే పృథ్వీరాజ్ షాక్

పృథ్వీరాజ్ తన స్పీచ్‌లో రాజమౌళి కథ చెప్పిన రోజు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. “సర్ నుంచి మెసేజ్ వచ్చింది.. వెంటనే ఆఫీస్‌కి వెళ్లాను. స్టోరీ చెప్పడం మొదలైన ఐదు నిమిషాల్లోనే నేను షాక్ అయ్యాను. ఆ ఊహ ఎలా వస్తుంది? ఆ విజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అనిపించింది” అని ఆయన తెలిపారు.

అయిదు నిమిషాల్లోనే ‘సర్ నేను ఇదే చేస్తా’ అని ఖచ్చితంగా అనుకున్నానని చెప్పారు. అదే రోజు మూడు గంటలపాటు కథ వింటూ అవాక్కయ్యానని, ఇది జీవితంలో మరువలేని అనుభవమని పేర్కొన్నారు.

34
టార్చరస్ షూటింగ్ కూడా ఆనందమే.. పృథ్వీరాజ్
Image Credit : X/screenrant

టార్చరస్ షూటింగ్ కూడా ఆనందమే.. పృథ్వీరాజ్

రాజమౌళి సినిమాల్లో నటులపై శారీరకంగా శ్రమ, భావోద్వేగంగా భారీ ప్రెషర్ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ కూడా అంగీకరించారు. “రాజమౌళి సర్ షూటింగ్ చాలా కఠినమైనది. కానీ అదే కఠినత ఈ సినిమా గొప్పతనాన్ని నిరూపిస్తుంది. ఎంత శ్రమపడితే అంత మంచి పని వస్తుంది. అలాంటి దర్శకుడి నమ్మకాన్ని పొందడం నాకు పెద్ద గౌరవం” అని అన్నారు.

పృథ్వీరాజ్ పోషిస్తున్న పాత్ర ప్రధాన ప్రతినాయకుడిగా ఉండబోతోంది. అతని క్యారెక్టర్ సినిమాలోని అత్యంత బలమైన ఎమోషనల్, శారీరక పరీక్షలతో కూడి ఉంటుందని ఆయన వెల్లడించారు.

44
విలన్ పాత్రకు కొత్త డైమెన్షన్ కుంభ పాత్ర
Image Credit : Asianet News

విలన్ పాత్రకు కొత్త డైమెన్షన్ కుంభ పాత్ర

ఈవెంట్ సందర్భంలో మేకర్స్ ‘కుంభ’ అనే ప్రత్యేక పాటను విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి అందించిన ఈ మ్యూజిక్, పృథ్వీరాజ్ నటించిన భయంకర విలన్ పాత్రను మరింత హైలైట్ చేస్తోంది. పాటలోని గ్రావిటీ, విజువల్స్, థ్రిల్లింగ్ స్కోర్ అభిమానుల్లో భారీ అంచనాలు కలిగించాయి. పాట విడుదలైన తర్వాత, తన పాత్రకు ఇంత బలమైన సంగీతాన్ని అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు.

మహేష్, ప్రియాంక చోప్రా, రాజమౌళి.. వేదిక అదిరిపోయింది

ఈవెంట్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హాజరై మరింత గ్లామర్ తెచ్చారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, “ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. మహేష్ బాబు, రాజమౌళిలు ఇచ్చిన ఆదరాభిమానాలు కుటుంబం లాగా అనిపించాయి” అని చెప్పారు. పృథ్వీరాజ్ కూడా మహేష్ బాబు గురించి మాట్లాడారు. “నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా పోకిరి. అప్పటి నుంచి మీ లెగసీ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా మీకు కెరీర్ లో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది” అని అన్నారు.

The three stars of S.S. Rajamouli’s next film, Mahesh Babu, Priyanka Chopra, and Prithviraj Sukumaran, on stage at the #GlobeTrotter launch event. pic.twitter.com/zeGzOrQ47C

— Screen Rant (@screenrant) November 15, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
రుద్రగా మహేష్‌.. ఏమున్నాడురా బాబు.. అదిరిపోయింది అంతే !
Recommended image2
మహేష్ బాబు వారణాసి స్టోరీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved