MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందు మహేష్ క్లియర్ గా చెప్పాడు, ఆ మాట వల్లే నమ్రత సినిమాలకు దూరం..సితారని ప్లాన్ చేసి కనలేదు

పెళ్ళికి ముందు మహేష్ క్లియర్ గా చెప్పాడు, ఆ మాట వల్లే నమ్రత సినిమాలకు దూరం..సితారని ప్లాన్ చేసి కనలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దాదాపు 18 ఏళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్ కంటే వయసులో నమ్రత ఐదేళ్లు పెద్ద. కానీ వీరిద్దరూ చూడముచ్చటైన జంటగా.. అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2024, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దాదాపు 18 ఏళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.  2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్, నమ్రత వివాహం 2005లో ముంబైలో జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మహేష్ కంటే వయసులో నమ్రత ఐదేళ్లు పెద్ద. కానీ వీరిద్దరూ చూడముచ్చటైన జంటగా.. అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పెళ్లి నాటి సంగతులు గుర్తు చేసుకుంది. పెళ్లి తర్వాత ఎందుకు నటించలేదు అని యాంకర్ ప్రశ్నించగా నమ్రత బదులిచ్చింది. 

36

పెళ్లి తర్వాత కూడా తనకి ఆఫర్స్ వచ్చాయని కాని తాను ఒప్పుకోలేదని నమ్రత తెలిపింది. భవిష్యత్తులో కూడా నటించే ప్రసక్తే లేదని నమ్రత పేర్కొన్నారు. ఎంత అద్భుతమైన రోల్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో కూడా నటించను అని నమ్రత తెలిపారు. 

46

మహేష్ ని వివాహం చేసుకునే సమయానికే మీరు సినిమాలు మానేశారు. ఎందుకు అని యాంకర్ ప్రశ్నించింది. నమ్రత బదులిస్తూ.. మహేష్ చాలా క్లియర్ గా ఉన్నాడు. పెళ్ళికి ముందే చెప్పాడు. తనకి వర్కింగ్ వుమెన్ భార్యగా వద్దు అని. అందుకే సినిమాలు మానేసినట్లు నమ్రత పేర్కొంది. 

56

మహేష్ నిర్ణయానికి గౌరవం ఇచ్చి నమ్రత సినిమాలకు దూరం అయ్యారు. అయితే మహేష్ బాబుకి సంబంధించిన వాణిజ్యపరమైన అంశాలన్నీ నమ్రత ప్లాన్ చేస్తారు. మహేష్ బాబు చేయాల్సిన యాడ్లు, వాటి రెమ్యునరేషన్ మొత్తం నమ్రత చూసుకుంటుందట. 

66

దీనివల్ల మహేష్ కి వర్క్ ఒత్తిడి తగ్గింది అని గతంలో సూపర్ స్టార్ కృష్ణ తన కోడలి గురించి చెబుతూ మురిసిపోయారు. మహేష్, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. నమ్రత సితార గురించి మాట్లాడుతూ.. సితారని తాము ప్లాన్ చేసి కనలేదని నవ్వుతూ చెప్పారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Recommended image3
Chiranjeevi: ఇష్టపడి కట్టప్ప మూవీ రీమేక్ చేసిన చిరు, మామూలు డిజాస్టర్ కాదు..సందీప్ వంగా ఆఫీస్ లో పులిరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved