- Home
- Entertainment
- Guppedantha Manasu: మహేంద్ర కాలర్ పట్టుకున్న అనుపమ.. రిషి దగ్గర మళ్లీ నిజం దాచిన వసుధార!
Guppedantha Manasu: మహేంద్ర కాలర్ పట్టుకున్న అనుపమ.. రిషి దగ్గర మళ్లీ నిజం దాచిన వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. బాధలో ఉన్న తండ్రిని మార్చుకోవాలని తపన పడుతున్న కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 27 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి ని రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనుపమ. తనతోపాటు లోపలికి వచ్చి టీ తాగమంటాడు రిషి. ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిన్నర్ కూడా చేస్తాను, అర్జెంటుగా ఫ్రెండ్ ని కలవాలి అంటుంది. అలాగే ఇక నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతుంది అనుపమ. ఇదంతా చూస్తున్న మహేంద్ర కంగారు పడిపోతాడు. లోపలికి వచ్చిన రిషిని పట్టుకొని ఆవిడతో ఏం మాట్లాడావు, ఆవిడ కార్ లో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.
అలా అడుగుతున్నారేంటి ఆవిడ మీకేమైనా తెలుసా అని అడుగుతాడు రిషి. అలా అని కాదు.. కార్లో డ్రాప్ చేసింది కదా అందుకే అడిగాను అంటూ మాట మార్చేస్తాడు మహేంద్ర. నన్ను ఎవరో కార్ తో డాష్ ఇవ్వబోయారు. ఆవిడే సేవ్ చేసింది, వద్దంటున్నా వినకుండా నన్ను ఇక్కడికి డ్రాప్ చేసింది అంటాడు రిషి. మహేంద్ర కంగారుగా దెబ్బలు ఏమి తగలలేదు కదా అంటాడు. ఏమి జరగలేదు, పదండి లోపలికి వెళ్దాం అంటాడు రిషి.
లేదు నేను కొంచెం బయటికి వెళ్లి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు మహేంద్ర. నేను కూడా వస్తాను అంటాడు రిషి. వద్దు నాన్న, నేను ఎక్కువ దూరం ఏమీ వెళ్ళను ఇక్కడే చల్లగాలికి తిరిగి వస్తాను అని చెప్పటంతో రిషి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పటికే రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వసుధార. ఏం జరిగింది సార్ ఇంత లేట్ ఎందుకు అయింది అని అడుగుతుంది. తనకు జరిగిన అటాక్ గురించి చెప్తాడు రిషి.
ఇక్కడ కూడా నామీద అటాక్ చేయవలసిన అవసరం ఏముంది, అమ్మ చనిపోయి ఇన్ని రోజులైనా అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఒక వైపు పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు అంత పగడ్బందీగా ఎవరు ప్లాన్ చేస్తున్నారంటావు అంటాడు రిషి. జాగ్రత్తగా ఆలోచించండి సార్, మీరు ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నారు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరే కనుక్కోగలరు అంటుంది వసుధార. ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు రిషి.
అవును సార్, శత్రువులు బయట ఎక్కడో ఉండరు మన చుట్టూనే తిరుగుతూ మనతోనే ఉంటారు మనమే గమనించలేము కానీ మన గురించి అన్ని తెలిసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అంటుంది వసుధార. మనసులో మాత్రం క్షమించండి సార్ నాకు నిజం తెలిసినా చెప్పలేకపోతున్నాను, మీరు సాక్షాలు అడిగితే నేను చూపించలేను, భగవంతుడా వాళ్ళ పెద్దమ్మ మీద అన్నయ్య మీద అనుమానం కలిగేలాగా చేయు అని కోరుకుంటుంది వసుధార.
మరోవైపు అనుపమ, మహేంద్ర నిన్న కలిసిన ప్లేస్ లోనే కలుస్తారు. జగతి గురించి అడుగుతుంది అనుపమ. ఆమె టాపిక్ తేవద్దు అంటాడు మహేంద్ర. మీ ఇద్దరి మధ్య టర్మ్స్ అంత బాలేవా, నువ్వు ఏదో దాస్తున్నావు నిజం చెప్పు అంటూ మహేంద్ర కాలర్ పట్టుకుంటుంది అనుపమ. ఏంటి ఇదంతా అని అడుగుతాడు మహేంద్ర. మహేంద్ర కి సారీ చెప్పి అసలు ఏమైందో చెప్పు అంటుంది అనుపమ.
చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు మహేంద్ర. నీ గురించి చెప్పు అంటాడు. నువ్వు జగతి కలిసి అడిగినప్పుడు చెప్తాను అంటుంది అనుపమ. సరే టైం అవుతుంది వెళ్దాం అని మహేంద్ర చెప్పడంతో నేను డ్రాప్ చేస్తాను అని మహేంద్రని ఒప్పించి రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడ మళ్లీ నువ్వు ఏదో దాస్తున్నావు నిజం చెప్పు అని అడుగుతుంది.
వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వసుధార చూస్తుంది కానీ ఆవిడ మొహం కనిపించదు. ఆవిడేనా అనుపమ అంటే అని అనుకుంటుంది. ఆ తర్వాత రూమ్ కి వచ్చేసరికి రిషి భోజనానికి సిద్ధమవుతూ ఉంటాడు. వసుధారని కూడా భోజనానికి రమ్మంటాడు. ఇంతలో అటుగా వెళుతున్న మహేంద్ర ని పిలిచి డాడ్ రండి భోజనం చేద్దాం అంటాడు. నేను చేసేసాను మీరిద్దరూ కలిసి భోజనం చేయండి అని చెప్పి ఇతని గదిలోకి వెళ్ళిపోతాడు.
డాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మారారు, పూర్తిగా మారే వరకు మనం ఇక్కడే ఉందామని అంటాడు రిషి. అందుకు ఓకే చెప్తుంది వసుధార. భోజనం చేస్తూ మహేంద్ర గురించి అనుమాన పడుతుంది. అనుపమంటే ఆవిడేనా, ఆవిడ వల్లే మావయ్యలో అంత మార్పు వచ్చిందా.. మావయ్యని అడుగుదామా అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.