Guppedantha manasu: రిషి మనసు మార్చే ప్రయత్నం చేసిన మహేంద్ర.. వసుధార నిర్ణయం ఏంటి?
Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ (Guppedantha manasu) గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్లో ఈ రోజు మార్చ్ 5వ తేదీ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం..

వసుధారా గౌతమ్ కు కాల్ చేసి రిషి సార్ ని ఎక్కువగా మాట్లాడించకండి, సార్ ని ఒంటరిగా ఉండనివ్వండి అని రిషి గురించి జాగ్రత్తలు చెప్తుంది. గౌతమ్ వసుధారా రిషి ని అర్థం చేసుకోవడం చూసి వసుధారా ను మెచ్చుకుంటాడు గౌతమ్.
ఇక వసుధారా గొడవలు తొందరగా ముగిసిపోయి, ముగ్గురు కలిసి పోతే బాగుంటుంది అని అనుకుంటుంది. రిషి ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలన్నింటినీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అది చూసిన మహేంద్ర రిషిని మాట్లాడించడానికి వస్తాడు కానీ రిషి మహేంద్ర వైపు చూడటానికి కూడా ఇష్టపడడు.
ఇక మహేంద్ర రిషి మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ నేను జగతి విషయంలో ఏ తప్పు చేయలేదు నిజం చెప్పి కరెక్ట్ చేశాను అంటాడు వాళ్లు నీ గురించి మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు అందుకే ఇలా చేశాను అంటాడు. కానీ రిషి మహేంద్ర చెప్పిన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
వసుధార జగతి కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ జగతి రిషి మహేంద్రా ల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అలాగే రిషి మనసుకు అయిన గాయం గురించి ఆలోచిస్తూ ఇంకా బాధ పడుతుంది. వసుధారా రిషికి మెసేజ్ చేస్తుంది కానీ రిషి వసుధారా కు సరైన సమాధానం ఇవ్వడు
దేవయాని గౌతమ్ ముందు జగతి గురించి చులకనగా మాట్లాడుతుంది దాంతో మహేంద్ర గౌతమ్ ను ఫోన్ తీసుకురమ్మని పక్కకు పంపించి దేవయానికి జగతి విషయంలో తప్పుగా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు మీరు మనసులో ఏం జరగకూడదు అనుకుంటారో అదే జరుగుతుంది అని సెటైర్లు వేస్తాడు.
వసుధారా అందరికన్నా ముందు కాలేజీకి వెళ్లి రిషి గురించి ఆలోచిస్తూ సార్ ఈరోజు వస్తాడా రాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు రిషి రావడంతో ఆనందపడుతుంది వసుధార. రిషి మనసును మార్చడానికి వసుధారా రిషి జీవితాన్ని ఒక కథలాగా చెబుతూ ఉంటుంది. కానీ రిషికి నచ్చక వసుధారా ను తిడతాడు.
గౌతమ్ వచ్చి ఈరోజు మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం వసుధారా అంటాడు. అది విన్న రిషి గౌతమ్ వైపు కోపంగా చూసి ఈరోజు మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం వసుధారా అంటాడు. దాంతో గౌతమ్ షాక్ అవుతాడు. వసుధార మాత్రం అంతలోనే కోపం అంతలోనే స్నేహం అనుకుంటూ మీరు నిజంగా ప్రిన్స్ సార్ అనుకుంటుంది. మరి ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.