Guppedantha Manasu: అన్న కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పిన మహేంద్ర.. తల్లి కొడుకులకి సూపర్ షాకిచ్చిన వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ గా ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్య పోయిన దుఃఖాన్ని భరించలేకపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 10 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో దీనంగా పడి ఉన్న మహేంద్ర దగ్గరికి వస్తారు రిషి వాళ్ళు. తండ్రిని ఆ పరిస్థితులలో చూసి చాలా బాధపడతారు. ఏంటి డాడీ ఇక్కడ ఉన్నారు పదండి ఇక్కడనుంచి వెళ్ళిపోదాం అంటాడు రిషి. రిషి..జగతి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు అన్యాయం చేసింది అని కొడుకుని పట్టుకొని ఏడుస్తాడు మహేంద్ర. తను ఎప్పుడూ నా పక్కనే ఉండేది ఇప్పుడు తన ఫోటోని చూసుకోవాల్సి వస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.
ఇంటికి వెళ్దాం రండి సర్ అంటుంది వసుధార. వద్దు నేను రాలేను నాకు ఇక్కడే హాయిగా ఉంది. ఇక్కడ జగతి కోసం పడిగాపులు పడితే అయినా తను నాకోసం వస్తుంది అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు. అయితే మహేంద్ర ని బుజ్జగించి, ఒప్పించి తీసుకొచ్చి కార్లో కూర్చోబెడతారు రిషి, వసుధార. కార్లో కూర్చున్నంత సేపు జగతి గురించి బాధపడుతూనే ఉంటాడు మహేంద్ర. నేను డ్రింక్ చేశానని తనకి చెప్పొద్దు తను చాలా బాధపడుతుంది అంటాడు.
మీరు కాసేపు ఏమీ ఆలోచించకండి సార్ పడుకోండి అంటుంది వసుధార. ఆలోచించుకుండా ఎలా ఉంటానమ్మా అంటూ బాగా ఏడుస్తాడు రిషి. మహేంద్ర ని ఇంటికి తీసుకువస్తారు వాసుధార వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఇంట్లోకి తీసుకు వెళ్లదు, నేను ఇంట్లో ఉండలేను నన్ను బయటకు తీసుకెళ్లి పో అంటూ గొడవ చేస్తాడు మహేంద్ర. ఆ గొడవకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. తమ్ముడిని అలా చూసి చాలా బాధపడతాడు ఫణీంద్ర.
దేవయాని మహేంద్రని తాగి ఇంటికి వస్తావా అంటూ మందలిస్తుంది. నా తమ్ముడు తాగుబోతు కాదు, జీవితంలో ఎప్పుడూ తాగలేదు బాధ భరించలేక ఇప్పుడు తాగుతున్నాడు. నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే మంచిది అంటూ భార్యని మందలిస్తాడు ఫణీంద్ర. నన్ను క్షమించండి నావల్ల మీరు కూడా బాధపడుతున్నారు. నాదరదృష్టాన్ని మీ వరకు తీసుకు వస్తున్నాను నన్ను క్షమించండి అంటూ అన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాడు మహేంద్ర.
అలాంటిదేమీ లేదు మహేంద్ర, నువ్వు వదిన మాటలు పట్టించుకోవద్దు అంటూ డాడీని ఇంట్లోకి తీసుకెళ్ళు అని రిషి వాళ్లకి చెప్తాడు ఫణీంద్ర. తండ్రిని గదిలోకి తీసుకువెళ్లిన తర్వాత మజ్జిగ తాగమంటాడు రిషి. నేను తాగవలసింది మజ్జిగ కాదు అంటూ జేబులో నుంచి మందు బాటిల్ తీస్తాడు మహేంద్ర. అది చూసి అందరూ షాక్ అవుతారు. మీరు తాగకండి డాడ్, మేడం వస్తారు లేండి అంటూ ధైర్యం చెప్తాడు రిషి. మేడమ్ ఏంటి మేడం, అమ్మ అని పిలువు అంటూ కొడుకుని కోప్పడతాడు మహేంద్ర.
నాకు భార్య పోయింది, నీకు తల్లి పోయింది నువ్వు కూడా బాధలో ఉండి ఉంటావు. ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం నువ్వు తాగు అంటూ రిషి ని బలవంత పెడతాడు మహేంద్ర. వసుధార వారిస్తుంది. ఇంతలో అక్కడికి దేవయాని,ఫణీంద్ర వస్తారు. ఏంటి మహేంద్ర ఇది, నువ్వు తాగడం తప్పంటే రిషి ని కూడా తాగమంటున్నావు, నిన్ను చూసి రేపు రిషి కూడా తాగడం మొదలు పెడతాడు అంటుంది దేవయాని. మీరు నా గురించి బాధపడకండి అంటాడు రిషి.
నిన్ను నోరు ముయ్యమన్నాను కదా అంటాడు ఫణీంద్ర. మహేంద్ర బాగా ప్రెస్టేట్ అవుతూ నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా, దీనంతటికీ కారణం మీరే, నా బాధని తగ్గించే మందు మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి. నా బాధని మీరే తగ్గించండి లేదంటే నన్ను కూడా జగతి దగ్గరికి పంపించండి అంటూ బుర్ర గోడకేసి గుద్దుకుంటాడు. అతనిని బలవంతంగా ఆపుతారు రిషి వాళ్ళు.అటు తిరిగి ఇటు తిరిగి అందరూ కలిపి నన్నే చెడ్డదాన్ని చేస్తున్నారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.
నెక్స్ట్ సీన్ లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. మన ఇంట్లో విషాదం జరిగింది, అలాగని ఎన్ని రోజులు ఇంట్లో ఉండిపోతాం. మనల్ని నమ్ముకుని కాలేజీ ఉంది. ముందు ఆ కాలేజీ ఎమ్ డి సీటు భర్తీ చేయాలి, కాలేజీ మీద ఎవరో కన్నేశారు ఆ కుట్రలకి మీ అమ్మ బలైపోయింది. మీ నాన్న ఎండి సీటు స్వీకరించే పరిస్థితులలో లేడు. నువ్వైనా ఆ పదవి స్వీకరించు అంటాడు.
ఇలాంటి పరిస్థితులలో నేను అక్కడికి రాలేను అంటాడు రిషి. మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటుంది వసుధార. ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు రిషి. అవును సార్ నేను, ఫణీంద్ర సార్ మినిస్టర్ గారిని, ఎస్ఐ గారిని ఈ కేసు విషయం గా కలిసాము అంటుంది వసుధార. ఆమె మాటలకి ఒకసారిగా షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.