- Home
- Entertainment
- ప్రభాస్ సినిమాలను దాటేసిన `మహావతార్ నరసింహ`.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ .. 26 రోజుల్లో ఎంత వచ్చాయంటే
ప్రభాస్ సినిమాలను దాటేసిన `మహావతార్ నరసింహ`.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ .. 26 రోజుల్లో ఎంత వచ్చాయంటే
`మహావతార్ నరసింహ` యానిమేషన్ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది.ఈ సినిమా భారీ వసూళ్లని రాబడుతోంది. తాజాగా ప్రభాస్ సినిమాలను దాటేయడం విశేషం.
`మహావతార్ నరసింహ` కలెక్షన్లు
మైథలాజికల్ యానిమేషన్ మూవీ `మహావతార్ నరసింహ` ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఇండియా వైడ్ గా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఏకంగా మూడు వందల కోట్ల మార్క్ కి చేరుకుంటోంది. మొదటి రోజు రూ.1.75కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు మూడు వందల కోట్లకు చేరువలో ఉండటం విశేషం.
KNOW
ప్రభాస్ సినిమాలను దాటేసిన `మహావతార్ నరసింహ`
అంతేకాదు `మహావతార్ నరసింహ` మూవీ పలు బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ చిత్రం తాజాగా ప్రభాస్ మూవీ కలెక్షన్లని దాటేయడం విశేషం. హిందీ బెల్ట్ లో ప్రభాస్ నటించిన రెండు సినిమాల కలెక్షన్లని దాటేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరి ఇంతకి ఈ చిత్రం ప్రభాస్ నటించిన ఏ సినిమాల రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసుకుందాం.
నార్త్ లో ప్రభాస్‌కి భారీ మార్కెట్
ప్రభాస్‌కి నార్త్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే సమయంలో మంచి మార్కెట్ ఏర్పడింది. డివైడ్ టాక్ వచ్చిన చిత్రాలు కూడా అక్కడ భారీగా వసూలు చేస్తున్నాయి. `బాహుబలి 2` ఏకంగా ఐదు వందల కోట్లు దాటింది. గతేడాది వచ్చిన `కల్కి 2898 ఏడీ` కూడా సుమారు. రూ.280కోట్లు రాబట్టింది. అలాగే `సాహో` మూవీ హిందీలో `రూ.150కోట్లు వసూలు చేసింది. మరోవైపు `సలార్` రూ.153కోట్లు రాబట్టింది.
`సాహో`, `సలార్`లా కలెక్షన్లని దాటేసిన `మహావతార్ నరసింహ` మూవీ
ఈ క్రమంలో ఇప్పుడు `మహావతార్ నరసింహ` మూవీ `సాహో`, `సలార్` రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.160కోట్లు రాబట్టింది. హిందీలోనే ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లు రావడం విశేషం. ఈ సినిమాకి ఇండియాలోనే రూ.250కోట్లు వచ్చాయి. తెలుగులో రూ.44కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా కేవలం రూ.15కోట్లతో రూపొందగా, ఇప్పుడు 17 రెట్లు వసూళు చేసింది. లాభాల పంట పండిస్తోంది.
విష్ణు అవతారం నరసింహ కథతో రూపొందిన `మహావతార్ నరసింహ`
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన `మహావతార్ నరసింహ` చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్ నిర్మించింది. హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది. జులై 25న విడుదలైన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌పై అల్లు అరవింద్ విడుదల చేశారు. విష్ణువు అవతారాల్లో ఒకటై నరసింహ అవతారం ప్రధానంగా చేసుకుని, ఆయన భక్తుడు ప్రహ్లాద కథ నేపథ్యంలో ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. ఇండియాలోనే యానిమేషన్‌లో ఇంత క్వాలిటీతో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.