Devatha: రాధ కోసం మాధవ ఎత్తులు.. భయంతో కుమిలిపోతున్న రుక్మిణి, ఆదిత్య!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తన చేతిపై స్కెచ్ పెన్నుతో రాసుకున్న దేవి పేరు చెడిపోయిన సమయంలో అప్పుడే దేవి వచ్చి నయినా చెయ్యి చూపి తైలం తెచ్చాను నొప్పి తగ్గడానికి అని అంటుంది.. అప్పుడు దేవి కళ్లు మూసుకోమని చెప్పి మళ్లీ స్కెచ్ తో దేవి పేరు రాసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. పేరు రాసుకున్న తర్వాత మాధవ దేవి ముందు వెళ్లి నిలబడుతాడు.
సారీ తల్లి మ్యాజిక్ చెయ్యలేకపోయాను అని చెప్తాడు. పర్లేదు లే నాన్న అని జామపండ్లు రెండు మాధవకు ఇస్తుంది. ఇవి ఎక్కడివి అంటే భాగమ్మ అమ్మమ్మ ఇచ్చింది అని చెప్తుంది. దాంతో రాధ తన బలగాన్ని పెంచుకుంటూ పోతుంది అయితే అని మాధవ అనుకుంటాడు.. అతర్వాత సీన్ లో దేవిని కొత్త స్కూల్ లో జాయిన్ చేసేందుకు రుక్మిణిని కూడా రమ్మని ఆదిత్య పిలుస్తాడు.. ఎందుకు అని రుక్మిణి ఆలోచిస్తుండగా మాధవ వస్తాడు..
ఇక దేవి మాటలు విన్న రాధ నేను కూడా వస్తున్నాను అని చెప్తుంది. అవునా అయితే ఆఫీసర్ సార్ తో వెళ్ళినప్పుడు అయన రేంజ్ లో రెడీ అవ్వాలి కదా.. పో పొయ్యి రెడీ అవ్వు అని చెప్తాడు. ఇక దానికి దేవి కూడా అవును అమ్మ రెడీ అవుదురా అని తీసుకెళ్తా అంటుంది. అయిన ఆఫీసర్ సార్ కోసం ఎలా రెడీ కావాలి అనేది మీ అమ్మకు తెలుసులే అమ్మ అని వెటకారంగా అంటాడు.
అగు మీ సార్ కు ఫోన్ చేస్తాను.. హడావిడిగా వస్తుంటాడు అని చేసి ఆదిత్యతో కూడా వెటకారంగానే మాట్లాడుతాడు. కాస్త నిదానంగా రండీ.. రాధ రెడీ అవ్వాలి కదా అని దొంగ చూపులు చూస్తాడు. మరో సీన్ లో మాధవ ఎందుకు ఇలా మాట్లాడాడు.. రాధ ఎందుకు కంగారు పడుతుంది అని ఆదిత్య అనుకుంటాడు. నా అధికారాన్ని వాడితే మాధవ్ నా నీడని కూడా ముట్టలేడు.. రుక్మిణి ఎందుకు బాధపడుతుంది అని అనుకుంటాడు..
గట్టిగా మాట్లాడుదాం అంటే దేవి మనసు బాధపడుతుంది అని మాట్లాడలేకపోతున్నాను అని ఆదిత్య ఫీల్ అవుతాడు.. మరోవైపు రాధ ఫోటో చూస్తూ.. ఎందుకు రాధ నన్ను ఇలా చెడ్డవాడిగా మారుస్తున్నావ్.. నువ్వు నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నావ్.. నీకోసం నేను ఎత్తులకు పైఎత్తులు వెయ్యాల్సి వస్తుంది అని మాధవ అంటాడు. నా ప్లాన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నాను అని మీరు బుర్రలు పాడుచేసుకుంటారు.
అదే నాకు కావాలి.. నేనుండగా నువ్వు నా గడప దాటలేవు.. దేవి వాళ్ళ నాన్నకు దగ్గర కాలేదు అని సీరియస్ లుక్ ఇస్తాడు. ఇక మరో సీన్ లో ప్రిన్సిపాల్ దగ్గర దేవి గురించి ఆదిత్య చెప్తాడు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ మీ నాన్నలనే నువ్వు కూడా బాగా చదివి కలెక్టర్ అవ్వాలి.. అప్పుడే మా స్కూల్ కి కూడా పేరు వస్తుంది అని దేవితో అంటుంది. అంతా సరే కానీ ఆఫీసర్ సార్ ను మా నాన్న మా నాన్న అని అంటారు ఏంటి అని దేవి అంటుంది.
ఆ మాటలకు ఆదిత్య, రాధ ముఖాలు వాడిపోతాయి. అదేంటి మీ డాడీని ఆఫీసర్ సార్ అంటావ్ అని ప్రిన్సిపాల్ అంటే తను నా దోస్త్ అని చెప్తుంది. అప్పుడు ప్రిన్సిపాల్ సారీ సార్ రిలేషన్ తెలియకుండా మాట్లాడేసాను అని ప్రిన్సిపాల్ అంటుంది. ఇక తర్వాత సీన్ లో జానకి ఆదిత్య గురించి మాట్లాడుతుంది. అదేంటీ మాధవ.. ఆ ఆఫీసర్ మన దేవిని స్కూల్ లో జాయిన్ చెయ్యడం ఏంటి.. మనం లేనివాళ్లమా అంటూ జానకి వెళ్ళిపోతుంది.
నీకు ఆదిత్య గురించి తెలీదులే అమ్మ అని అనుకుంటాడు.. నేను దేవినే రాధపై అస్త్రంగా మార్చాబోతున్న అని మాధవ రాక్షసంగా ఒక నవ్వు నవ్వుతాడు. మరో సీన్ లో రుక్మిణి, ఆదిత్య మాధవ గురించి మాట్లాడుకుంటారు. మాధవ ఏం చెయ్యలేడు.. నువ్వు బయపడకు మన జోలికి వస్తే వూరికే ఉండేది లేదు అని ఆదిత్య రాధకు దైర్యం చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.