Devatha: రాధ గురించి సత్యకు అసభ్యంగా చెప్పిన మాధవ్... ఆలోచనలలో పడిన ఆఫీసర్ భార్య!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దేవి ఆ ఖాళీ ఫోన్ చూసి సత్యతో ఇలాంటి ఫోనే మా అమ్మ దగ్గర కూడా ఉంది అని అంటుంది. అప్పుడు సత్య ఈ ఫోన్ వాచ్మెన్ కి ఇచ్చా అని చెప్పాడు కదా ఆదిత్య. మరి అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళింది,అంటే ఆదిత్య, నాకు కూడా అబద్ధం చెప్పడం మొదలు పెడుతున్నాడా? అసలు నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఆదిత్య కి ఏముంది? అని సత్యం అనుకుంటుంది. దాని తర్వాత సీన్లో రుక్మిణి,ఆదిత్య దగ్గరకు వెళ్లి బయటకు తీసుకెళ్తాను అని చెప్పి దేవిని అడ్డం పెట్టుకొని తీరా మన ఇంటికి తీసుకెళ్లాడు.
లోపలికి రా అంటూ బలవంతం చేశాడు. చివరి నిమిషం వరకు అడిగితే అప్పుడు తప్పించుకున్నాను అని అంటుంది. అప్పుడు ఆదిత్య, మన ఇంటికి ఎందుకు తీసుకెళ్లాడు! అయినా అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? వాడి కూతురికి తల్లి కావాలని ఇంకొక కూతురికి తండ్రికి దూరం చేస్తాడా? అని అంటాడు ఆదిత్య. అప్పుడు రుక్మిణి మనసులో వాడికి కావాల్సింది వాడి కూతురు తల్లి కాదు నేను.
ఈ విషయం నీకు చెప్తే ఇప్పటికిప్పుడే వాడ్ని ముక్కలు చేస్తావు అందుకే నేను నీకు ఈ విషయం చెప్పకుండా దాచాను అని మనసులో అనుకుంటుంది. నువ్వు వాడిని ముందు కొట్టావు నేను అయితే కార్ తో తొక్కించబోయాను అంత కోపం వస్తుంది అని అంటుంది రుక్మిణి. ఇంత జరుగుతున్నా నేనేం చేయలేకపోతున్నానే అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో మాధవ్ ఇంటికి వచ్చి ఇందాక రోడ్డు మీద జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ రాధ పూర్తిగా మారిపోయింది.
కారుతో నన్నే గుద్దేస్తాను అన్నంతవరకు వచ్చింది. ఈ విషయం నా చేయి జారిపోయేకముందే నేను ఏదైనా చేయాలి అని అనుకుంటాడు.అదే సమయంలో సత్య తో ఇంటికి వస్తుంది దేవి. ఇంటికి వచ్చి అమ్మేది నాయనా అని అడగగా దారిలో ఎవరో ఫ్రెండ్ కనబడ్డాడు,మాట్లాడిన తర్వాత వస్తాను అని చెప్పింది అని అంటాడు మాధవ్. సత్య కి అనుమానం వస్తుంది.దేవి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు సత్య నిజం చెప్పండి బావ అక్కకి ఈ ఊర్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు.
నా దగ్గర దాయొద్దు అని మాధవ్ని అడగగా "నువ్వు అక్క, బావ అని ఇంత ప్రేమగా పిలుస్తున్నావు కాబట్టి చెప్తున్నాను,ఈ మధ్య రాధ అసలు ఇంట్లో మనిషిలాగే ఉండట్లేదు పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడుతుంది" అని మాయమాటలు చెప్పి సత్యం మనసులో విషయం నింపుతాడు మాధవ్. సత్య మనసులో,"అయితే ఆదిత్య రోజంతా ఫోన్ మాట్లాడుతుంది అక్కతో నా, బయటకి కలవడానికి వెళుతుంది కూడా అక్క కోసమేనా" అని అనుకుంటుంది.
ఇదే మంచి సమయం అని మాధవ్ ఏడుపుని నటిస్తూ సత్య ని ఇంకా నమ్మిస్తాడు. సత్యా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాధవ్, ఎక్కడ నిప్పు పెట్టాలో అక్కడ పెట్టాను ఇప్పుడు అదే భగ్గుమంటుంది అని అనుకుంటాడు. తర్వాత సీన్లో గది అంతా చండాలంగా ఉంది అని దేవుడమ్మ ఆదిత్య గదిని సర్దుతూ ఉండగా దేవి మీసాలు పెట్టుకున్న ఫోటో చూస్తుంది. చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఈలోగా ఆదిత్య అక్కడికి వచ్చి ఆ మీసం దేవి ఏ పెట్టుకుంది అని చెప్పి నవ్వుకుంటాడు.
మీసాలతో దేవిని చూస్తుంటే అచ్చం నీలాగే ఉంది అని అంటుంది దేవుడమ్మ. ఆ తర్వాత సీన్లో రుక్మిణి భోజనం కోసం టేబుల్ రెడీ చేస్తూ ఉండగా మాధవ్ అక్కడికి వస్తాడు. రుక్మిణి భయపడుతుంది నేను మరీ అంత భయంకరంగా ఉన్నానా అని మాధవ్ అడగగా పిల్లల మనసుల్లో విషం నింపడం కన్నా భయంకర మీకేం ఉంటుంది అని తిరిగి అంటుంది రుక్మిణి .అప్పుడు మాధవ్ నేను ఇచ్చిన ఆఫర్ నీకు నచ్చలేదా?, దేవీ భవిష్యత్తు గురించి ఆలోచించవా? అని అంటాడు మాధవ్. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!