మదరాసి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Madharaasi Twitter Review: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్- స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన ‘మదరాసి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీని చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను, రివ్యూలను సోషల్ మీడియాలో వెల్లడించారు.

యాక్షన్ థ్రిల్లర్ గా మదరాసి
Madharaasi Twitter Review: 'అమరన్' సినిమా సక్సెస్ తో కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఆయన కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మదరాసి' (Madharaasi). ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్ రూపొందించిన మదరాసి మూవీ నేడు (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మదరాసి బడ్జెట్ ఎంత?
సుమారు 200 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన మదరాసి సినిమాను తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని కీలక సీన్‌లకు నాక్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్, బీస్ట్ బెల్స్ విజువల్ ఎఫెక్ట్ వర్క్ అందించాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను చూసిన నెటిజన్లు, క్రిటిక్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.
మదరాసి సినిమా కథ ఏంటీ?
మదరాసి సినిమా కథ విషయానికొస్తే, ఇది తమిళనాడులో అక్రమ ఆయుధాల రవాణా నేపథ్యంలో సాగుతుంది. నార్త్ ఇండియా మాఫియా, రెండు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ల మధ్య జరిగే యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా సినిమా రూపుదిద్దుకుంది. హీరో శివకార్తికేయన్ రఘు పాత్రలో కనిపిస్తారు. రఘు తన ప్రియురాలిని కాపాడేందుకు క్రిమినల్ ప్రపంచంలో అడుగుపెడతాడు, కానీ అతని అస్థిరమైన మనస్తత్వం అతన్ని హింస వైపు నడిపిస్తుంది. దీంతో అతను హీరోనా లేదా విలనా అనే సందేహాన్ని రేకెత్తించేలా పాత్రను తీర్చిదిద్దారు. కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ వంటి అంశాలు హైలెట్‌గా నిలిచాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది?
మదరాసి సినిమాలో శివకార్తీకేయన్ నటన అద్బుతం. తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఫుల్ పీక్స్‌లోకి తీసుకెళ్లారు. సినిమా లైన్ స్ట్రాంగ్‌గా ఉంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బాగా ఉన్నాయి. అనిరుధ్ అందించిన సంగీతం, బీజీఎం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. విజువల్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే, రుక్మిణి వసంత్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లవ్ సీన్స్ ప్రత్యేకం. చివరగా, ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు.
#Madharaasi REVIEW#SivaKarthikeyan on #Madharaasi PEAKED 🤩
✨ “A very solid film”
🎬 @ARMurugadoss, Good screen play, direction 🥳
🎶 Anirudh – the hit machine, BGM = 🔥🥹
👏 visual + Quality
💖 Rukmini, beautiful inside & out, makes the love portions shine!
MY RATING - 4/5 pic.twitter.com/f384p8AxMD— D.R BASHEENTH (@BasheenthR27147) September 4, 2025
హీరోయిన్ యాక్టింగ్ సూపర్
మరో నెటిజన్ కార్తీకేయన్ మదరాసి మూవీపై కామెంట్స్ చేస్తూ, ఈ సినిమాకు రేటింగ్ 2½/5 ఇచ్చారు. సినిమాకి ఉన్న క్వాలిటీ , కలరేషన్ బాగున్నాయని, విద్యుత్ జమ్వాల్ తన ప్రెజెన్స్, యాక్షన్ స్టంట్స్ ద్వారా సినిమాకు జోష్ ఇచ్చాడని పేర్కొన్నారు. అలాగే, రుక్మిణి వసంత్ “మాలతి” పాత్రలో అద్భుతంగా నటించి, పాత్రకు తగట్టు తన ప్రదర్శన బాగా కట్టిపడిందని ఆయన పేర్కొన్నారు.
#Madharaasireview insider Report ⚠️
📌Rating: 2½ /5 👍🏼
Positive ✅
⭐ Quality and coloration
⭐ Vidyut presence and stunts
⭐ Rukmini as "Malathy" nailed her role and emotions worked Good.#Madharaasireview insider Report ⚠️
📌Rating: 2½ /5 👍🏼 pic.twitter.com/YVm0IDwr3w— Dubbing baba (@dubbingbaba) September 4, 2025
శివకార్తికేయన్ ఖాతాలో హిట్ పడేానా?
మరో ట్విట్టర్ యూజర్ మదరాసి సినిమా తన రివ్యూ ఇస్తూ ఈ సినిమా చాలా అన్‌బేరబుల్ గా ఉందని పేర్కొన్నారు. ఏఆర్ మురగదాస్ ప్రయత్నం కనిపిస్తున్నప్పటికీ, ల్యాక్‌లస్టర్ రైటింగ్ వల్ల సినిమా నిరాశాజనకంగా మారింది. క్రమంగా వచ్చే ఓవర్-ది-టాప్ ప్రెజెంటేషన్, క్రైయింగ్ సీన్‌లు ప్రేక్షకులకు కోపాన్ని తీసుకవస్తాయి. ఈ సినిమా మేకింగ్ లో ఎగ్జిక్యూషన్ లోపం కనిపిస్తుందంటూ ఈ సినిమాకు 1½/5 రేటింగ్ ఇచ్చారు.
Rating: ⭐️½#Madharaasi is UNBEARABLE. Director @ARMurugadoss attempt is visible but the lacklustre writing makes it a disappointing affair. Constant over-the-top presentation, howling & build up leaves the audience irritated. The execution if flawed. NOT RECOMMENDED. 👎 pic.twitter.com/mnWOuBkKj5
— vidhya (@vidhya_ofcl) September 4, 2025
మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చేనా?
మరో ట్విట్టర్ యూజర్ మదరాసి మూవీపై మిక్సడ్ రివ్యూ ఇచ్చారు. మదరాసి సినిమా యాక్షన్ ప్యాక్‌గా ఉన్నప్పటికీ, రైటింగ్, స్క్రీన్‌ప్లే లో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం చూస్తే, సినిమా డిసాస్టర్ లాగా అనిపిస్తుందని, శివకార్తీకేయన్ లక్ అంటూ కామెంట్ చేశారు.
Inside report #Madharaasi
Movie has solid action packed but Poor Writing ✍️ With disappointing screen play 😬🤧
Overall Disaster @Siva_Kartikeyan lottery won't work on this bro pic.twitter.com/MqU1iRvUir— 𝑀𝑜𝓃𝓀𝑒𝓎`𝒟`~𝐿𝓊𝒻𝒻𝓎☆°𓃮 (@KollywoodTrack5) September 4, 2025
మిక్స్డ్ రెస్పాన్స్
మరో నెటిజన్ మదరాసి సినిమాపై తన రివ్యూ ఇస్తూ.. ఫస్ట్ హాఫ్‌లో శివకార్తీకేయన్ నటన "ఓకిష్" అని, రొమాన్స్ సీన్‌లు, సాంగ్స్ అసలు బాగాలేవని పేర్కొన్నారు. అయితే, రుక్మిణి వసంత్ నటన అద్బుతమని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రీ-ఇంటర్వెల్ సీన్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, సెకండ్ హాఫ్‌లో బిజు మేనన్ నటన అందర్ని మెస్మరైజ్ చేస్తుందన్నారు. కానీ, నెక్స్ వచ్చే సీన్‌లు ఈజీగా ఊహించదగ్గవని, సినిమా చాలా పొడవుగా అనిపించిందని తెలిపారు. క్లైమాక్స్ కూడా సాధారణంగా, ఆశించిన విధంగా ఉందని, ఏఆర్ మురగదాస్ రైటింగ్ లో లోపం కనిపిస్తుందంటూ చివరగా ఈ సినిమాకు 1/5 రేటింగ్ ఇచ్చారు.
First Half : #Madharaasi
SiKa acting okish.
Cringe Romance scenes &
Songs 👎👎
Rukmini V 👌👌👌
Vidyut okish.
Pre interval scenes 💥💥💥💥
Second Half :
Biju Menon 💥💥💥
Easily predictable scenes.
So lengthy.
As usual expected Climax.
POOR WRITING FROM ARM.
1/5 pic.twitter.com/nAOAMguVX4— Prof. H A B I L E (@almuyhi1_) September 4, 2025
ఇంతకీ మదరాసి సినిమా ఎలా ఉందంటే?
మరో నెటిజన్ మదరాసి సినిమా తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. హై యాక్షన్, హార్ట్ టచ్చింగ్, ఎమోషన్స్, ఎంగేజింగ్ స్టోరీలైన్ తో రూపొందిన సినిమా అంటూ కామెంట్ చేశారు. మొత్తం ఫ్యామిలీ అండ్ ఎంటైర్ ఆడియెన్స్ కోసం ఒక హోల్‌సమ్ ట్రీట్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాల ప్రకారం మదరాసి మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇది కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే కాబట్టి, అసలు సినిమా ఎలా ఉందో? శివకార్తికేయన్ ఖాతాలో మరో హిట్ పడిందా? ఏఆర్ మురుగదాస్‌కు 'మదరాసి' కమ్‌బ్యాక్‌గా నిలవనుందా? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
A perfect mix of high action, heartfelt emotions ❤️ and an engaging storyline 🎬 a wholesome treat for the entire family !!#Madharaasipic.twitter.com/daLhpLL6UX
— Cinewoods (@cinewoodss) September 4, 2025