గజినీ, తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మురుగదాస్ సౌత్ అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు. కానీ ఇటీవల మురుగదాస్ కి అంతగా కలిసి రావడం లేదు. వెండితెరపై మురుగదాస్ మ్యాజిక్ మిస్ అవుతోంది.
గజినీ, తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మురుగదాస్ సౌత్ అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు. కానీ ఇటీవల మురుగదాస్ కి అంతగా కలిసి రావడం లేదు. వెండితెరపై మురుగదాస్ మ్యాజిక్ మిస్ అవుతోంది. మురుగదాస్ తెరకెక్కించిన చివరి చిత్రాలు స్పైడర్, సర్కార్, దర్బార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కించిన దర్బార్ చిత్రం 2020లో విడుదలయింది. ఆయా తర్వాత మురుగదాస్ నుంచి మరో ప్రకటన రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. బన్నీ కూడా మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపారట.
కానీ ఇప్పుడు పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆ రేంజ్ స్క్రిప్ట్ దొరికితేనే బన్నీ ఆసక్తి చూపిస్తున్నాడు. అల్లు అర్జున్, మురుగదాస్ ప్రాజెక్టు తాత్కాలికంగా వాయిదా పడిందో లేక అటకెక్కిందో తెలియదు కానీ.. ఈ స్టార్ డైరెక్టర్ మరో హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్.
తమిళ స్టైలిష్ హీరో శింబుతో మురుగదాస్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
