- Home
- Entertainment
- Prema Entha Madhuram: కోర్టులో సడన్ ఎంట్రీతో షాకిచ్చిన మదన్.. ప్రత్యర్థుల కుట్రకి బలైన ఆర్య!
Prema Entha Madhuram: కోర్టులో సడన్ ఎంట్రీతో షాకిచ్చిన మదన్.. ప్రత్యర్థుల కుట్రకి బలైన ఆర్య!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ్ముడిని కాపాడటం కోసం జైలు పాలైన ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మా కంపెనీ ఇప్పటివరకు ఎవరి దగ్గర రూపాయి దొంగతనం చేయలేదు, నమ్మకంతోనే మా కంపెనీ రన్ అవుతుంది అంటాడు ఆర్య. మరి మీ మీద వచ్చిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారు అంటాడు జడ్జ్. మా అభివృద్ధిని చూడలేని కొందరు స్వార్థపరులు మా మీద ఫ్రాడ్ కేసులు వేశారు అంటాడు ఆర్య. ఆ డొల్ల కంపెనీలకి మీకు ఏ సంబంధం లేదా అని అడుగుతాడు జడ్జ్. లేదని చెప్తాడు ఆర్య. ఉంది యువరానర్ అందుకు తగిన సాక్షాలు నా దగ్గర ఉన్నాయి అంటూ పీపీ తన వాదన మొదలు పెడతాడు. నమ్మకం గురించి చాలా ఎక్కువగా ఉపన్యాసం ఇచ్చారు అదే నమ్మకంతో జనాలని ముంచేశారు.
మీకు ఇక్కడ ఒక రామాయణం కథ చెప్పాలి జడ్జిగారు అంటూ రాముని చెప్పులు భరతునికి ఇచ్చిన కథ చెప్తాడు పి పి. దానికి దీనికి ఏంటి సంబంధం అంటాడు జడ్జ్. ఉంది యువరానర్ అంటూ ఆర్య దగ్గరికి వచ్చి ఇప్పుడు మీ కంపెనీకి ఎండి ఎవరు అని అడుగుతారు పి పి. నా తమ్ముడు నీరజ్ వర్ధన్ అంటాడు ఆర్య. ఇన్నాళ్లు మీరు రన్ చేసిన కంపెనీ ఎందుకు మీ తమ్ముడికి ఇచ్చేశారు అని అడుగుతాడు పిపి. నేనే కావాలన్నాను అందుకే మా అన్నయ్య ఇచ్చేసాడు అంటూ ఆవేశంగా మాట్లాడుతాడు నీరజ్. ఇది నీ టర్మ్ కాదు కూర్చో అంటాడు పి పి.
తిరిగి ఆర్య దగ్గరికి వచ్చి తమ్ముడికి అధికారాలన్నీ ఇచ్చి ఒక కంపెనీలో దినసరి కూలీ గా పని చేస్తున్నాడు ఈ ఆర్య. ఫ్రాడ్ చేయమని తమ్ముడికి అథారిటీ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని ఆ తమ్ముడు జనాలని మోసం చేస్తున్నాడు. ఆనాటి రాముడు హీరో అయితే ఈనాటి ఈ ఆర్య విలన్ అంటాడు పిపి. ఇందులో నా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు నా తమ్ముడు ఇన్నోసెంట్ అంటాడు ఆర్య. అయితే మీరు ప్రాడ్ చేశారా అంటాడు పి పి. నేను చేయలేదు అంటాడు ఆర్య. ఆయన అబద్ధం చెప్తున్నారు ఫ్రాడ్ చేశారు అనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
అంటూ కొన్ని ఫైల్స్ జడ్జ్ గారికి ఇచ్చి అందులో ఉన్న సంతకాలు అతనివో కాదో చూడండి సార్ అని ఇస్తాడు. ఫైల్ పరిశీలించిన జడ్జి ఈ సంతకాలు మీవే దీనికి మీ సంజాయిషీ ఏమిటి అని అడుగుతాడు జడ్జి. ఇందులో మా అన్నయ్య తప్పు ఏమీ లేదు తప్పంతా నాదే అంటూ మళ్లీ ఆవేశంగా మాట్లాడుతాడు నీరజ్. నీరజ్ నువ్వు మాట్లాడొద్దు కూర్చో అంటూ మందలిస్తాడు ఆర్య. ఆ ఫైల్స్ నేను చూడొచ్చా అని అడుగుతాడు ఆర్య. నిరభ్యంతరంగా చూడొచ్చు దాంతోపాటు ఈయన మీద ఇంకొక అభియోగం కూడా ఉంది.మీ పర్మిషన్ తో అది కూడా వినిపిస్తాను అంటాడు పి పి. జడ్జి పర్మిషన్ ఇవ్వడంతో తన వాదన ప్రారంభిస్తాడు పి పి.
ఈయన కొల్లగొట్టిన 1300కోట్ల రూపాయల లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈ ముగ్గురు ఇప్పుడు కేసు వేశారు అంటూ అక్కడ ఉన్న తన ముగ్గురు క్లైంట్లని చూపిస్తాడు పి పి. మరో క్లైంట్ ఒక్కడే 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు ఆ వ్యక్తి అతనే అంటూ మదన్ ని చూపిస్తాడు పిపి. మదన్ ని చూసి అప్పుడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మదన్ బోన్ లోకి వచ్చి ఇతను ఒక ఫ్రాడ్ పర్సన్. ఇతన్ని నమ్మి నేను కష్టపడి సంపాదించిన సొమ్ము నేను పెట్టుబడిగా పెట్టాను. ఇప్పుడు లాస్ వల్ల నా బిజినెస్ అంతా దెబ్బతింది మీరే న్యాయం చేయండి అంటాడు మదన్.
అంజలి కోపంతో ఇదంతా అబద్ధం ఆర్య సార్ నా దగ్గరే వర్క్ చేస్తున్నారు అయినా చాలా మంచి మనిషి ఇలాంటి ఫ్రాడ్ చేశారంటే నేను నమ్మను అంటుంది. నీ నమ్మకాలతో ఎక్కడ ఎవరికీ పనిలేదు కూర్చో అంటాడు పి పి. అదే సమయంలో ఫైల్ చూసిన ఆర్య ఈ సంతకం నాదే కానీ ఫ్రాడ్ కోసం చేసినది కాదు అంటాడు ఆర్య.కత్తితో పొడిచాను కానీ చంపటానికి కాదు అన్నట్లుగా ఉంది వ్యవహారం అంటూ వెటకారంగా మాట్లాడుతాడు పి పి. ఇందులో ఏదో తిరకాసు ఉంది కొంచెం సమయం ఇస్తే నిజా నిజాలు మీకు తెలియజేస్తాము అంటాడు ఆర్య తరపు లాయర్. కుదరదు జడ్జిగారు ఇతనికి మెయిల్ ఇస్తే సాక్షులని బెదిరిస్తాడు అంటూ అడ్డుపడతాడు పి పి. కేసును పరిశీలించిన జడ్జిగారు ఫ్రాడ్ కి ఆర్య కి సంబంధం ఉన్నట్లుగా కోర్టు నమ్ముతుంది.
ఈ కేసుని సమగ్ర విచారణ జరిపించి తుది నిర్ణయాన్ని ఇవ్వవలసిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థని ఆదేశిస్తున్నాను. అంతవరకు నిందితులని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని జైళ్ళ శాఖని ఆదేశిస్తున్నాను. కేసు పూర్తయ్య వరకు కుటుంబ సభ్యులు దేశం విడిచి పోకుండా వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు తీసుకోండి అంటూ కోర్టుని ముగిస్తాడు జడ్జి.
జరిగిందంతా అనామకురాలికి చెప్తాడు పిపి. వెరీ గుడ్ మీకు రావలసింది ఇప్పుడే మీ అకౌంట్లో పడిపోతుంది అంటూ ఫోన్ పెట్టేస్తుంది అనామకురాలు. విష్ యూ హ్యాపీ జైల్ లైఫ్ ఆర్య అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.