MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Macherla Niyojakavargam Review: మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ, నితిన్ ప్రయోగం ఫలించిందా..?

Macherla Niyojakavargam Review: మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ, నితిన్ ప్రయోగం ఫలించిందా..?

సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న నితిన్.. ఈసారి పవర్ ఫుల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఫ్యాక్షన్ స్టోరీతో నితిన్ నటించిన సినిమానే మాచర్ల నియోజక వర్గం.  ఈ మూవీ ఈరోజు(12 అగష్ట్) రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోష్ పడగా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరి సినిమాపై ఎవరు ఏమన్నారు చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 12 2022, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

యంగ్ హీరో నితిన్  హీరోగా,  ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా  హీరోయిన్ లుగా న‌టించిన‌ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈసినిమాను తెర‌కెక్కించారు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే నితిన్... ఈసారి కంప్లీట్ గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్  యాక్ష‌న్ రోల్‌ను పోషించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ కాంబోతోంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను రకరకాలుగా వెల్లడిస్తున్నారు. మరి ఎవరెవరు ఏమన్నారు చూద్దాం. 

39

ఫస్ట్ హాఫ్ సినిమా పై ట్విట్టర్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మొదటి భాగం సినిమా యావరేజ్ గా ఉంది. అందులో గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటే వెన్నెల కిషోర్ కామెడి మాత్రమే చూడదగినది అంటున్నారు. అంతే కాదు సినిమాకు సెకండ్ హాఫ్ ప్రాణం పోస్తేనే ఈసినిమా నిలబడే అవకాశం ఉంది అంటున్నారు. నీడ్ బిగ్ సెకండ్ హాఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

49

ఫస్ట్ హాఫ్ మూవీపైన అందరివి ఒకేరకమైన రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ పూర్ గా ఉంది. వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ మాత్రమే ఫస్ట్ హాఫ్ కు ప్లస్.. మిగతా అంతా డల్ అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అన్ని సినిమాలు తీసుకువచ్చి కలిపి పెట్టినట్టుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  పాటలు పర్లేదు, ఇంటెర్వెల్ బ్యాగ్ ఏమో కాని. అసలు కథ సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయ్యిందంటున్నారు. 

59

అయితే కొంత మంది మాత్రం ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది అంటున్నారు. నితిన్ కు సక్సెస్ హోప్ వచ్చినట్టే అని ట్వీట్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సినిమా ఫష్ట్ హాఫ్ మంటలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం మనీ వేస్ట్, టైమ్ వేస్ట్ అంటూ తిట్టిపోస్తున్నారు. 
 

69

ఇక ఫస్ట్ హాఫ్ బాగాలేకపోయినా.. సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు ఆడియన్స్. సెకండ్ హాఫ్ మూవీ నితిన్ ను సేవ్ చేసిందంటూ పోస్ట్ లు పెడుతున్నారు.  నితిన్ లైఫ్ లో మాస్ మసాలా మూవీ.. ఫ్యాన్స్ కు పండగే అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

79

చాలా వరకూ సెకండ్ హాఫ్ మూవీతో  ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగారంటున్నారు ట్విట్టర్ జనాలు. అయితే మరికొంత మంది మాత్రం సెకండ్ హాఫ్ మూవీపై కూడా పెదవి విరుస్తున్నారు. ఈసినిమా టోటల్ గా ఆవరేజ్ అంటూ కొంత మంది.. బిలో ఆవరేజ్ అంటూ మరికొంత మంది. నితిన్ కెరీర్ లో మంచి హిట్ అంటూ మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. 
 

89

మొత్తానికి నితిన్ ఫ్యాన్స్ అయితేనేమో సాలిడ్ హిట్ కొట్టాం అన్నా అంటూ.. సంబరాలు చేసుకుంటుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.  సినిమా మొత్తంలో నితిన్, కృతి శెట్టి యాక్టింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. ఎక్కువగా ఈసినిమాలో క్రెడట్ అంతా వెన్నెల కిషోర్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. 
 

99

మరి ఈరోజు అంతటా రిలీజ్ అవుతున్న ఈసినిమా ఓవర్ ఆల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.  ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈసినిమాకు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ఎడిటర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు కాగా.. సినిమాటోగ్ర‌ఫి ప్ర‌సాద్ మూరెళ్ళ‌ అందించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved