MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ పై కుట్ర? పుష్ప 2 పై నెగిటివ్ ప్రచారం షురూ!ఈ వ్యతిరేక పవనాల వెనకుంది ఎవరు?

అల్లు అర్జున్ పై కుట్ర? పుష్ప 2 పై నెగిటివ్ ప్రచారం షురూ!ఈ వ్యతిరేక పవనాల వెనకుంది ఎవరు?

అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఓ వ్యతిరేక వర్గం తయారైన సూచనలు కనిపిస్తున్నాయి. అతన్ని తొక్కేయాలని కంకణం కట్టుకున్న కొందరు పుష్ప 2 మీద నెగిటివ్ ప్రచారం షురూ చేశారట. ఈ పరిస్థితులు దాన్ని నిరూపిస్తున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 18 2024, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Allu Arjun

Allu Arjun


ప్రతి చోట రాజకీయాలు ఉంటాయి. ఒకడు ఎదుగుతుంటే పది మంది క్రిందకు లాగాలని ప్రయత్నం చేస్తుంటారు. అల్లు అర్జున్ ని కూడా టాలీవుడ్ లో తొక్కేసే ప్రయత్నం జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

గత ఐదేళ్లలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అల వైకుంఠపురంలో, పుష్ప చిత్రాలు ఆయన ఇమేజ్ భారీగా పెంచేశాయి. 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన అల వైకుంఠపురంలో అనేక రికార్డులు బ్రేక్ చేసింది. కెరీర్లో మొదటిసారి అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ హిట్ పడింది. 

310

ఇక పుష్ప 2తో లెక్కలన్నీ మార్చేశాడు అల్లు అర్జున్. నాన్ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదిగాడని ఆయన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. సుకుమార్ పుష్ప ప్రకటన చేసినప్పుడు పాన్ ఇండియా ఆలోచన లేదు. రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకోలేదు. 
 

410


రాజమౌళి సూచన మేరకే రెండు పార్ట్స్ గా పుష్ప తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నారట. రాజమౌళి సలహా గొప్ప ఫలితం ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప నార్త్ ఇండియాలో మ్యాజిక్ చేసింది. మొదటిరోజు కేవలం రూ. 3 కోట్లు వసూలు చేసిన పుష్ప హిందీ వర్షన్, రూ. 100 కోట్ల వసూళ్లను అధిగమించడం ఊహించని పరిణామం.
 

510


అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ మరో టాలీవుడ్ హీరోకి నార్త్ లో లేదంటే అతిశయోక్తి కాదు. కల్కి హిందీ హక్కులు రూ. 100 కోట్లకు అమ్ముడుపోతే... పుష్ప 2 రైట్స్ రూ. 200 కోట్లకు కొన్నారు. పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 1000 కోట్లు అని సమాచారం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 24కి వాయిదా పడింది. 
 

610


కాగా పుష్ప 2 పై పలు నెగిటివ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ మధ్య విబేధాలు తలెత్తాయి. పుష్ప 2 షూటింగ్ ఆగిపోయింది. అందుకే అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేశాడు. పుష్ప 2 బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళనలో ఉన్నారు. పుష్ప 2 మూవీ పరిస్థితి ఏమిటో తెలియదు. అగమ్యగోచరంగా ఉంది... అంటూ కథనాలు వెలువడుతున్నాయి. 
 

710

ప్రస్తుతం అల్లు అర్జున్ యూరఫ్ లో ఉన్నారు. ఇక సుకుమార్ యూఎస్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్న సుకుమార్ అంతకంతకు ఆలస్యం చేస్తున్నాడట. ఇప్పటికే ఒకసారి పుష్ప 2 విడుదల వాయిదా పడింది. సెకండ్ రిలీజ్ డేట్ డిసెంబర్ 24కి అయినా పుష్ప విడుదల అవుతుందనే గ్యారంటీ లేదట. ఈ పరిణామం అల్లు అర్జున్ ని తీవ్ర అసహనానికి గురి చేసిందట. ఈ క్రమంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.   
 

810
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ టీమ్ ఈ రూమర్స్ ని ఖండించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో సుకుమార్, అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లారు. వారి మధ్య వివాదాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నారు. తిరిగి వచ్చాక యధావిధిగా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇదంతా పుష్ప 2 పై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంటున్నారు.

910

అదే సమయంలో.. ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ మీద జరుగుతున్న కుట్ర అనే వాదన టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అల్లు అర్జున్ కొన్ని విషయాల్లో వ్యవహరించిన తీరు నచ్చని ఓ వర్గం దీని వెనక ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ అని సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్న బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడనే వాదన చాలా కాలంగా ఉంది. ఇక కిరాక్ ఆర్పీ అనే ఒక చిన్న కమెడియన్ అల్లు అర్జున్ కి సవాల్ విసురుతున్నాడు. అతన్ని వెనకుండి కొందరు ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియా టాక్. 
 

1010

భవిష్యత్ లో అల్లు అర్జున్ ఇలాంటి కుట్రలు, వ్యతిరేక ప్రచారాలు అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. పుష్ప 2 విడుదలకు ముందు, విడులయ్యాక ఆ సినిమాను తొక్కేసే ప్రయత్నం ఇంకా గట్టిగా జరగనుంది. మరి ఈ వ్యతిరేక పవనాలు అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొని నిలబడతాడో చూడాలి.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Folk Song : నాగదుర్గ కంటే ముందే యూట్యూబ్‌ ను షేక్ చేసిన తోపు, మూడు పాటలకే 35 కోట్ల వ్యూస్! ఎవరీ శిరీష?
Recommended image3
Naga Chaitanya: నాగ చైతన్యకి ఆస్తులు ఎలాగూ ఉన్నాయి, కానీ అలా చేస్తే నకిలీ అవుతాడు.. బాలకృష్ణ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved