ప్రేక్షకులకు నచ్చినట్టు సినిమా తీయలేను.. లోకేష్ కనగరాజ్ బోల్డ్ స్టేట్‌మెంట్
రజనీకాంత్‌తో తీసిన `కూలీ` సినిమా విడుదల తర్వాత మొదటిసారి దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఫెయిల్యూర్‌కి కారణం వెల్లడించారు.

`కూలీ` సినిమాకి ట్రోల్స్ కి గురైన లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్ కనకరాజ్. `కూలీ` సినిమాకి రూ.50 కోట్లు తీసుకున్నారు. వరుసగా 5 హిట్లు ఇచ్చిన లోకేష్, `లియో` వరకు ఏ సినిమాకీ పెద్దగా ట్రోల్స్ రాలేదు. కానీ `కూలీ` సినిమాకి బాగా ట్రోల్ అయ్యారు. అనేక విమర్శలు వచ్చాయి.
`కూలీ` ఫలితంపై మొదటిసారి స్పందించిన లోకేష్
`కూలీ` సినిమా తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ చాలా విషయాలు చెప్పారు. `కూలీ` రిజల్ట్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకుల అంచనాలే తనని ఇక్కడ కూర్చోబెట్టాయని, అవి లేకపోతే సినిమా తీయలేమని అన్నారు.
ప్రేక్షకుల అంచనాలకు సినిమా తీయను
అనిరుధ్ లేనిదే సినిమా లేదు
విజయం అంటే వసూళ్లు కాదని, సినిమాను పూర్తి చేసి ప్రజలకు చూపించడమేనని, వసూళ్లు నిర్మాతలవని అన్నారు. అనిరుధ్ లేకుండా సినిమా తీయనని చెప్పారు. `ఖైదీ 2`కి కూడా అనిరుధే సంగీతం అందిస్తారని తెలుస్తోంది. ఇక లోకేష్ రూపొందించిన `కూలీ` మూవీలో టాప్ హీరోలు నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, వంటి వారు కలిసి నటించారు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. కానీ లాంగ్‌రన్‌లో సక్సెస్ కాలేకపోయింది.