- Home
- Entertainment
- పవన్‌తో వివాదం విషయంలో అల్లు అర్జున్ ప్లాన్ ఇదే, కానీ నానమ్మ ఇంత పని చేస్తుందనుకోలే.. ఆల్ సెట్?
పవన్‌తో వివాదం విషయంలో అల్లు అర్జున్ ప్లాన్ ఇదే, కానీ నానమ్మ ఇంత పని చేస్తుందనుకోలే.. ఆల్ సెట్?
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఎన్నికల సమయంలో నెలకొన్న వివాదం విషయంలో బన్నీ ఓ ప్లాన్ చేశారు. కానీ నానమ్మ ప్లాన్స్ అన్నింటిని మార్చేసింది.

పవన్, బన్నీ మధ్య వివాదం
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌కి మధ్య వివాదం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో మామయ్య పవన్‌కి కాకుండా నంధ్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు బన్నీ. దీంతో అప్పట్నుంచి పవన్, బన్నీల మధ్య గ్యాప్ వచ్చింది. అది అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ కి కారణమైందనే వార్తలు వ్యాపించాయి.
అల్లు అర్జున్ విషయంలో గుర్రుగా పవన్
కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. బన్నీ సపోర్ట్ చేసిన శిల్పారవిచంద్రా రెడ్డి కూడా ఓడిపోయారు. పవన్ ఘన విజయం సాధించారు. డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా కూడా పవన్ కళ్యాణ్‌కి, బన్నీకి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ విషయంలో పవన్ సీనియస్‌గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. తనయుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు అల్లు అర్జున్ కలిసే విషయంలో పవన్ అంతగా ఆసక్తి చూపించలేదని, మీడియాకి వార్త లీక్ కాకూడదనే కండీషన్‌తో కలిసినట్టు సమాచారం.
ఆ ఘటనతో బన్నీలో మార్పు
అయితే అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇది కేసు కావడం, ఈ కేసులో బన్నీ ఒక్క రోజు రాత్రి జైల్లో కూడా ఉండాల్సి రావడం వంటి పరిణామాలు అల్లు అర్జున్‌లో మార్పుకి కారణమయ్యాయని సమాచారం. ఆ సమయంలోనే అల్లు అర్జున్.. అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రకటించారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోస్‌తోనూ కలిసి పనిచేయబోతున్నారు. అంతర్జాతీయంగానూ ఈ మూవీని ప్రమోట్ చేయబోతున్నారట. రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది.
పవన్‌ని పర్సనల్‌గా కలవాలనుకున్న అల్లు అర్జున్
అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కొంత టైమ్ తీసుకుని అల్లు అర్జున్.. తన ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలని భావించారట. అదే సమయంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్‌తో నెలకొన్న వివాదాన్ని, ఆ గ్యాప్‌ని పోగొట్టి మళ్లీ కలిసిపోవాలని అనుకున్నారట. ఫ్యామిలీలో అందరిని పర్సనల్‌గా వెళ్లి కలవాలని ప్లాన్ చేశారట బన్నీ. తమ మధ్య నెలకొన్న చిన్న చిన్న మనస్పర్థాలను క్లీయర్ చేసుకుని అంతా కలిసి పోవాలని అనుకున్నారట. తాము అంతా ఒక్కటే అనే విషయాన్ని బలంగా చెప్పేందుకు ప్లాన్ చేశారని సమాచారం.
అంతా క్లీయర్ చేసిన అల్లు కనకరత్నమ్మ
కానీ అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ అన్నీ లెక్కలు మార్చేసింది. ఆమె మరణంతో అన్నీ సెట్ అయిపోయాయి. బన్నీ అనుకున్నది మొత్తం నానమ్మ చేసేసింది. పవన్‌ని, బన్నీని కలిపింది. రెండు కుటుంబాల మధ్య గ్యాప్‌ని కూడా తొలగించింది. అల్లు అర్జున్ నానమ్మ, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ మరణించిన మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది. ఆ మరుసటి రోజు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. బన్నీని హగ్ చేసుకున్నారు. నిర్మాత అల్లు అరవింద్, బన్నీ, వారి కుటుంబ సభ్యులతో చాలా సేపు మాట్లాడారు. ఆ టైమ్‌లో వీరంతా చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాకి రిలీజ్ చేశారు. ఇందులో వారు ఉన్నదాన్ని బట్టి చూస్తే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసిపోయినట్టుగా ఉంది. అదే సమయంలో వారి మధ్య ఆ మనస్పర్థాలు కూడా తొలగిపోయాయని అర్థమవుతుంది. మరోవైపు నేడు పవన్ బర్త్ డే సందర్భంగా బన్నీ విషెస్ తెలిపారు. ఇలా అల్లు అర్జున్ నానమ్మ అంతా మార్చేసింది. బన్నీ చేయడానికి ముందే వారిని కలిపేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.