MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bappi Lahiri Death:డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్... బప్పీ లహరి కెరీర్ లో సాధించిన అరుదైన విజయాలు

Bappi Lahiri Death:డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్... బప్పీ లహరి కెరీర్ లో సాధించిన అరుదైన విజయాలు

డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా కొనియాడబడిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి (Bappi Lahiri)నేడు కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న బప్పీ లహరి  తుదిశ్వాస విడిచారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 16 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

69 ఏళ్ల బప్పీ లహరి మరణం సంగీత ప్రియులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 80-90లలో బప్పీ లహరి మ్యూజిక్ ఓ సెన్సేషన్. దేశంలో ఎక్కడ పార్టీ జరిగినా బప్పీ లహరి సాంగ్స్ వినిపించాల్సిందే. మిథున్ చక్రవర్తి సినిమా కోసం ఆయన కంపోజ్ చేసిన 'ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్'... ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు ఎవరూ అందుకోలేనివి. బప్పీ లహరి గురించి అరుదైన విషయాలు ఇప్పుడు చర్చిద్దాం.. 
 

28


భారతీయ సంగీతం పై చెరగని ముద్రవేసిన  బప్పీ లహరి పదుల సంఖ్యలో హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు.  1983 నుండి 1985 వరకు 12 సూపర్ హిట్ సిల్వర్ జూబ్లీ సినిమాలకు మ్యూజిక్ అందించిన రికార్డు ఆయన సొంతం. దేశంలో మరే ఇతర మ్యూజిక్ డైరెక్టర్ పేరిట ఈ రికార్డు లేదు. 

38

 లెజెండరీ సింగర్, నటుడు కిషోర్ కుమార్ బప్పీ లహరికి స్వయానా మేనమామ. బప్పీ లహరి అమ్మ తరపు బంధువైన కిషోర్ కుమార్ బప్పీ లహరి పరిశ్రమకు రావడంలో తోడ్పాటు కల్పించారు. కెరీర్ బిగినింగ్ లో అతనికి మద్దతు ఇచ్చారు. 
 

48


దేశంలోని అన్ని ప్రముఖ భాషల చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఆయనకున్న డిమాండ్ రీత్యా ఏడాదికి లెక్కకు మించిన చిత్రాలకు పనిచేసేవారు. 1986లో, బప్పి లహరి 33 సినిమాలకు 180కి పైగా పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరారు. ఇదో అరుదైన రికార్డు. 

58


1989లో BBC ఆధ్వర్యంలో లండన్‌లో జరిగిన లైవ్ మ్యూజిక్ షోకి జోనాథన్ రాస్‌చే బప్పీ లహరిని ఆహ్వానించారు. ఈ గౌరవం అందుకున్న  ఏకైక భారతీయ సంగీత దర్శకుడు  బప్పీ  లహరి కావడం విశేషం. 

68

జస్టిస్ ఫర్ విడోస్ అనే NGOకి చేసిన కృషికి గాను హౌస్ ఆఫ్ లార్డ్స్ అతనిని సత్కరించింది. ఒంటినిండా బంగారం ధరించడం బప్పీ లహరి సిగ్నేచర్ మార్క్. దీనిపై ఎన్ని విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు ఎదురైనా... బప్పీ లహరి వదల్లేదు.  ఓ రిపోర్ట్ ప్రకారం  ప్రకారం, 2014 నాటికి బప్పీ లహరి 754 గ్రాముల బంగారు ఆభరణాలను కలిగి ఉన్నారు. సదరు బంగారు ఆభరణాల అప్పటి ఖరీదు17,67,451.ప్రముఖ గాయకుడు ప్రతిరోజూ 8-9 బంగారు గొలుసులను ధరించేవారు.

78
Bappi Lahiri

Bappi Lahiri


2011లో, బప్పీ  లహిరి అమెరికన్ ఐడల్ కంటెస్టెంట్ షాన్ బారోస్‌తో పాటు వాకింగ్ ఆన్ లవ్ స్ట్రీట్ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు.

88


 బప్పీ  లహరి హిట్ పాట జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా హాలీవుడ్ చిత్రం యు డోంట్ మెస్ విత్ ది జోహాన్స్‌లో ప్రదర్శించబడింది.బప్పీ లహరి ఒకప్పుడు ఒకే రోజులో అత్యధిక పాటల రికార్డింగ్‌లు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
కమల్ హాసన్ పై ప్రేమ, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన బాలీవుడ్ స్టార్ ఎవరు?
Recommended image2
Nithiin Flop Movies: నితిన్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలుసా, కమెడియన్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
మగాళ్ళను కుక్కలతో పోల్చిన స్టార్ హీరోయిన్ రమ్య, ఇచ్చి పడేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved