- Home
- Entertainment
- లావణ్య త్రిపాఠి పింక్ శారీలో ఇంత బ్యూటిఫుల్‌గానా.. వోరగా చూస్తూ మత్తుచల్లుతున్న అందాల రాక్షసి.. చూస్తే అంతే
లావణ్య త్రిపాఠి పింక్ శారీలో ఇంత బ్యూటిఫుల్‌గానా.. వోరగా చూస్తూ మత్తుచల్లుతున్న అందాల రాక్షసి.. చూస్తే అంతే
లావణ్య త్రిపాఠి చాలా గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. రెండు నెలలకుపైగానే ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజాగా ఫ్యాన్స్ కి మత్తెక్కించే ట్రీట్ ఇచ్చింది. పింక్ శారీలో హోయలు పోయింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కిర్రాక్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కిక్కు ఎక్కించే పోజులు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ఇందులో సైడ్ యాంగిల్‌లో ఓరగా చూస్తూ కేకపెట్టిస్తుంది లావణ్య. ఓ రకంగా చూపులతోనే చంపేస్తుంది. ఇక ఇందులో పింక్ శారీపై ఆమె పోస్ట్ పెట్టింది. పింక్ ధరించడం వల్ల నేను ఎప్పుడూ అలసిపోతానని అనుకోను` అని పేర్కొంది. ప్రస్తుతం లావణ్య ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
అందాల రాక్షసిగా ఫేమస్ అయ్యింది లావణ్య త్రిపాఠి. తొలి చిత్రంతోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కాస్త బోల్డ్ గా ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ బ్యూటీ వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
అయితే `అందాల రాక్షసి` సినిమా తర్వాత తెలుగులో దాదాపు పదాహారు సినిమాలు చేసింది లావణ్య. `భలే భలే మగాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. కానీ యావరేజ్ హిట్లు కూడా అందుకుంది. కానీ ఇప్పటికీ లావణ్యని అందాల రాక్షసిగానే పిలుస్తుంటారు నెటిజన్లు. అలానే ముద్ర వేసుకుంది. దాన్ని మరిపించే సినిమా ఆమెకి పడలేదని చెప్పచ్చు.
Lavanya Tripathi
ఆ మధ్య `అర్జున్ సురవరం`, `ఏ1ఎక్స్ ప్రెస్` చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు `చావు కబురు చల్లగా`, `హ్యాపీ బర్త్ డే` చిత్రాలు బోల్తా కొట్టాయి. అంతకు ముందు కూడా వరుస పరాజయాలు వెంటాడాయి. పైగా ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది. కారణం ఏదైనా ఇప్పుడు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో `తనల్` అనే చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌తో లవ్ లో ఉన్నట్టు ఆ మధ్య వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఏకంగ్ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. ఒకటిరెండు సార్లు కలిసి కనిపించారు. దీంతో రూమర్స్ ఊపందుకున్నాయి. కానీ అందులో నిజం లేదని వీరు స్పందించడం గమనార్హం. కానీ ఆ మధ్య వీరి లవ్ స్టోరీ రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి.