Intinti Gruhalakshmi: అనసూయను రెచ్చగొడుతున్న లాస్య.. పరందామయ్య కోసం తులసి పూజలు?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 17 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ ఇద్దరూ టిఫిన్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన ప్రేమ్ వారిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు థాంక్స్ దేవుడా మంచి మనుషుల్ని దగ్గర చేసి మంచి పని చేశావు అని అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. మరొకవైపు పరంధామయ్య స్నానం చేసి ఫ్రెష్ అవుతూ ఉండగా అప్పుడు అనసూయ పరంధామయ్యకు తల తుడుస్తూ ఉంటుంది. అప్పుడు జీవితంలో ఎప్పుడూ లేనివిధంగా నా మీద మీరు కోపంగా ఉన్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా మీరు వేసిన శిక్షణ అనుభవిస్తున్నాను అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది అనసూయ. మీరు నా మీద కోప్పడుతున్నారు.
ఒకవేళ మీ కోపం తగ్గి మాట్లాడాలి అనుకుంటే నేను ఉంటానో లేదో అని అంటుంది అనసూయ. అప్పుడు నందు నీకోసం అర్ధరాత్రి కేక్ కట్ చేయించి నీ పుట్టినరోజు కానుకగా చేయాలి అనుకున్నాడు వాడు ఏదో పని ఉందని రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్లిపోయాడు వాడు ఈ బట్టలు నీకోసం తెచ్చాడు అని అనసూయ పరంధామయ్యకు ఆ బట్టలు ఇస్తుంది. ఈ బట్టలు వేసుకుని నందుని సంతోష పెట్టండి అని అనసూయ బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య ఏం మాట్లాడకుండా ఆ బట్టలు తీసుకుంటాడు. మరోవైపు లాస్య పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటుంది.
ఇంతలో అనసూయ అక్కడికి నువ్వు ఒక్కదానివే కాఫీ కుడితి తాగినట్టు తాగడం కాదే మీ మామయ్యకు కూడా తీసుకుని వెళ్ళు అని అంటుంది. అప్పుడు అనసూయ అసలు విషయం చెప్పడంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య కావాలనే తులసి విషయం గురించి ప్రస్తావన తీసుకొస్తూ అనసూయని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంతలోనే లాస్య నందు కి ఫోన్ చేస్తూ ఉండగా నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు నందు నాన్న పరిస్థితి చూడలేక ఒక విధంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అనుకొని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు ప్రేమ్,సామ్రాట్,తులసి ముగ్గురు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు సామ్రాట్ అభి అన్న మాటలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ సంతోషం జరిగిన ప్రతిసారి ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది సంతోషం పాడవుతుంది అని అనగా వెంటనే తులసి సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి బాధ వచ్చినప్పుడు బాధపడాలి ప్రేమ్ అంతే అని అంటుంది తులసి. అప్పుడు తులసి జోకులు వేసి వారిద్దరిని నవ్విస్తుంది. తర్వాత తులసి పూజ కోసం మొత్తం సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడు పూజారిగారు శతాయుష్మాన్ పూజ కోసం మొత్తం అని సిద్ధం చేశారు కదమ్మా అని అనగా ఎందుకు అమ్మ ఈ పూజ అని అనడంతో తాతయ్య పుట్టినరోజు కదా ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజ చేయిస్తున్న ప్రేమ్ అని అంటుంది తులసి.
మరొకవైపు లాస్య అనసూయ ఇద్దరు కలిసి పూజ చేస్తూ పరంధామయ్య గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పరంధామయ్య వస్తాడు. అప్పుడు అనసూయ పూజ చేస్తుంది. అప్పుడు అందరూ ముఖం ఒకలాగా పెట్టుకోవడంతో లాస్య అది చూసి కోప్పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మాధవి పరంధామయ్య కోసం వస్తుంది. అప్పుడు అనసూయ పరంధామయ్య ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు లాస్య మాట్లాడించడంతో వెంటనే మాధవి వెటకారంగా మాట్లాడిస్తుంది. అప్పుడు మాధవి పరందామయ్య ఇద్దరు బయలుదేరుతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు అనడంతో తులసి దగ్గరికి అని అనగా వెంటనే అనసూయ మీరు వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది.
అప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నేను వెళ్లాల్సిందే అని అంటాడు పరంధామయ్య. అప్పుడు దివ్య వాళ్ళు కూడా పరంధామయ్యతో వాళ్లతో కలిసి బయలుదేరుతారు. అప్పుడు అనసూయ అభి లాస్య ముగ్గురు తులసి మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరొకవైపు తులసీ పరంధామయ్య కోసం పూజ చేయిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి పరందామయ్య వస్తాడు. అప్పుడు అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.