- Home
- Entertainment
- రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా
రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా
కుంభమేళాలో మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఒక సాధారణ యువతి ఇప్పుడు వెండితెరని ఏలే అవకాశం దక్కించుకుంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

లక్షలాది మంది హాజరైన కుంభమేళాలో ఒక అమ్మాయి స్టార్ గా మారింది. ఆమె పేరు మోని భోంస్లే (మోనాలిసా). కుంభమేళాలో రూ.100కి దండలు అమ్ముతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్లని తలదన్నేలా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆమెను చూడటానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో, మోని ఆ దండ అమ్మకం మానేసి ఇంటికి తిరిగి రావాల్సి రావడం పెద్ద వార్త అయింది.
ఇదంతా జరిగిన తర్వాత, హిందీ ఆల్బమ్‌లో నటించింది. క్రమంగా ఆమె క్రేజ్ పెరుగుతుండడంతో ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మోని ఒక మలయాళీ సినిమాలో నటించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. దానికి సంబంధించిన అన్ని సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
పికె బిను వర్గీస్ దర్శకత్వం వహించే చిత్రంలో మోనాలిసా నటించనుంది. ఈ చిత్రం పేరు నాగమ్మ. దీనిని జిల్లీ జార్జ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. కైలాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పూజా వేదిక వద్ద కైలాష్ ఓనం సందర్భంగా మోనాలిసాకి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమ్మాయి.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు తన తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి దండలు అమ్మడానికి వచ్చింది. కెమెరాల దృష్టిని ఆకర్షించడంతో మోనాలిసా జీవితం మారిపోయింది. నీలి కళ్ళు కలిగిన ఈ అమ్మాయి అన్ని జాతీయ మీడియాలో వార్తగా మారింది. కేరళలో కూడా మోనాలిసా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఆమె నటించే తొలి చిత్రం విజయవంతం అయితే మోనాలిసా పెద్ద స్టార్ అయిపోయినట్లే.
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కూడా మొనాలిసాకి తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సనోజ్ మధ్య ప్రదేశ్ లోని ఆమె ఇంటికి వెళ్లి మరీ తన చిత్రంలో రోల్ ఆఫర్ చేశారట. అయితే దీనితో సనోజ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.