- Home
- Entertainment
- Kriti Shetty Remuneration : సూర్యకి షాక్ ఇచ్చిన కృతి శెట్టి... రెమ్యూనరేషన్ పెంచేసిందంట..
Kriti Shetty Remuneration : సూర్యకి షాక్ ఇచ్చిన కృతి శెట్టి... రెమ్యూనరేషన్ పెంచేసిందంట..
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) తాజాగా సూర్య, బాలా కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తోందంట బేబమ్మ..
- FB
- TW
- Linkdin
Follow Us
)
18 ఏండ్లలకే సినీ ఇండస్ట్రీని ఏలుతోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. వరుస గా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోతోంది. ఈ బ్యూటీ ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటోంది.
ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కృతి శెట్టి.. ఇక అటు తమిళంలోనూ తన సత్తా చూపించేందుకు బయల్దేరుతోంది. ఈ మేరకు తమిళంలో ఇటీవల ఓ భారీ ఆఫర్ ను దక్కించుకుంది.
ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య (Surya) సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇటీవలనే సూర్య, డైరెక్టర్ బాలా (Bala) కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘శివపుత్రుడు’ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఇటీవలే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. సూర్య 41వ చిత్రంలో కృతి శెట్టిని ఎంపిక చేయడం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నట్టు కూడా తెలిపారు. జ్యోతిక, సూర్య సమర్పణలో 2డీ ఎంటర్ టైన్స్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
కాగా, కృతి శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటుదట. మొన్నటి వరకు లక్షల్లోనే ఛార్జీ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సూర్య సినిమాకు మాత్రం ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ యువ హీరోయిన్ క్రేజ్ చూసిన మేకర్స్ కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఇఫ్పటికే కృతి.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘ది వారియర్’ (The Warrior) మూవీలో నటిస్తుంది. అలాగే నితిన్ తో ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో నటిస్తోంది.