హీరోయిన్లను అలా చూడొద్దు.. ప్రభాస్ బ్యూటీ ఆవేదన
Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ లింగ అసమానతపై తన గళం వినిపించారు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, హీరోలకు ఇచ్చే గౌరవం, సౌకర్యాలు తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్, స్టార్‌డమ్ మాత్రమే కాదు.. వెనకాల ఎన్నో ఇబ్బందులూ దాగి ఉంటాయి. ప్రత్యేకంగా హీరోయిన్‌ల విషయంలో అయితే తరచూ ఏదో ఒక సమస్య వినిపిస్తూనే ఉంటుంది. లైంగిక వేధింపులు నుంచి వివక్ష వరకు అనేక అనుభవాలు బయటకు వచ్చాయి.
ఈ అంశంపై అప్పుడప్పుడూ కొంతమంది కథానాయికలు ధైర్యంగా స్పందిస్తుంటారు. తాజాగా ప్రభాస్ హీరోయిన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon)కూడా ఇదే అంశాన్ని టచ్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో హీరోయిన్లను చిన్నచూపు చూడటం సరికాదని ఘాటుగా స్పందించారు.
ఇండస్ట్రీలో లింగ వివక్ష
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA)ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమితులయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, హీరోలకు ఇచ్చే గౌరవం, సౌకర్యాలు తమకు ఇవ్వడం జరగదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
హీరోలకు విలాసవంతమైన కార్లు, లగ్జరీ గదులు కేటాయిస్తారని, కానీ హీరోయిన్లకు అదే స్థాయి గౌరవం, సౌకర్యాలు లభించడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న విషయాలే అయినా ఇవే సమాజంలో అసమానతలను ప్రతిబింబిస్తాయని అభిప్రాయపడ్డారు హీరోయిన్ కృతి సనన్.
నెపోటిజంపై ఫైర్
అదే సమయంలో హీరోయిన్ కృతి సనన్ నెపోటిజం అంశంపైన కూడా స్పందించారు. స్టార్ కిడ్స్ పై ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే మేకర్స్ వారితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పారు.
తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడిన కృతి.. బయటివారిగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్, నిర్మాతగా ఎదగడం సులభం కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్స్, ట్రోలింగ్ తనను బాధించాయని కూడా ఆమె అన్నారు.
ప్యూచర్ ఫ్లాన్
తాను నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్తదనం ఉన్న ప్రాజెక్ట్స్ చేయాలని, కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ పైనే దృష్టి పెట్టాలని కృతి సనన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బ్యూటీ బ్రాండ్ ‘హైఫన్’తో వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టినట్లు తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..
సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘1 నేనొక్కడినే’తో తెలుగు తెరకు పరిచయం అయిన కృతి సనన్, ఆ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ సాధించకపోవడంతో టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేసింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఆమె జోరు ఆగలేదు. హీరో పంతి సినిమా ద్వారా హిందీ తెరపై అడుగు పెట్టిన ఈ బ్యూటీ, అక్కడినుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు.
‘మిమీ’ సినిమాలో నటనతో అలరించి, నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ గెలుచుకుంది. ఇక 2023లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించిన కృతి సనన్, ఆ తర్వాత నాలుగు బడా సినిమాలు చేసిన పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె అప్‌కమింగ్ హీరోలతో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది.