- Home
- Entertainment
- రంగురంగుల శారీలో మెరిసిపోతున్న కృతి సనన్.. చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్ అందాల విందు!
రంగురంగుల శారీలో మెరిసిపోతున్న కృతి సనన్.. చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్ అందాల విందు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకాబోతోంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తాజాగా చీరకట్టులో మతిపోయేలా ఫోజులిచ్చింది.

తెలుగు ఆడియెన్స్ ను ఇప్పటికే పరిచయం చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించబోతోంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘వన్ : నేనొక్కడినే’ చిత్రంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’తో ఆడియెన్స్ ముందుకు రానుంది. చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన నటించింది. సీతారాముల పాత్రల్లో ప్రభాస్, కృతి సనన్ ఆకట్టుకోబోతున్నారు. వచ్చే ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతకంటే ముందే హిందీలో రూపొందిన ‘భేదియా’తో అలరించనుంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘తోడేలు’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్, టీజర్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను మరింత జోరుగా కొనసాగిస్తుండటంతో.. కృతి సనన్ కూడా సోషల్ మీడియాలోనూ సినిమను తెగ ప్రమోట్ చేస్తోంది.
ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా రంగురంగుల చీరలో దర్శనమిచ్చింది. మ్యాచింగ్ బ్లౌజ్ లో టాప్ అందాలను విందు చేసింది. బ్యాక్, ఫ్రంటూ గ్లామర్ షోతో మతిపోగొట్టింది. మల్టీ కలర్డ్ శారీలో మరింతగా మెరిసిపోతూ నెట్టింట దుమ్ములేపుతోంది.
తాజాగా కృతి సనన్ చుట్టుకున్న శారీపై క్రేజీగా కామెంట్ చేసింది. ‘తుమ్కేశ్వరీ చీరల సందడి’ అంటూ క్యాప్షన్ ఇస్తూ ఫొటోలను షేర్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ అందాలను పొగుడుతూ అభిమానులు, నెటిజన్లూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.