బంపరాఫర్ కొట్టేసిన కృతీ శెట్టి.. ఈసారైనా కలిసోస్తుందా..?
అవకాశాలు లేక.. ఇబ్బందిపడుతుంది హీరోయిన్ కృతీ శెట్టి.. లక్కీ లెగ్ కాస్తా.. ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందికృతీ శెట్టి.. తాజాగా ఓ బంబర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

ఉప్పెన సినిమాతో ఉప్పెనలా టాలీవుడ్ మీడపడిపోయింది హీరోయిన్ కృతీ శెట్టి.. ఈసినిమా హిట్ తరువాత స్టార్ హీరోల చూపు ఆమెమీద పడటం.. స్టార్ మేకర్స్ కృతీ కోసం ఆరటపడటం వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది బ్యూటీ. ఉప్పెన తరువాత నానీతో శ్యామ్ సింగరాయ్ లో.. లిప్ లాక్.. బెడ్ సీన్ తో అదరగోట్టింది కృతీ శెట్టి. ఈమూవీ హిట్ అయ్యింది.
ఇక ముచ్చటగా మూడోసినిమా నాగచైతన్య జోడీగా బంగార్రాజు చేసింది. ఈమూవీ కూడా హిట్ అవ్వడంతో కెరీర్ బిగినింగ్ లోనే మూడు సినిమాలతో హిట్ కొట్టి.. హ్యాట్రీక్ హీరోయిన్ అన్న పేరును సాధించింది. అంతే కాదు టాలీవుడ్ లో లక్కీ లెగ్ అని పించుకుంది. దాంతో వరుస అవకాశాలు ఆమె గుమ్మం తొక్కాయి.
ఇక సినిమాల విషయంలో కాస్త సెలక్టీవ్ గానే ఉంది కృతీ.. ఏసినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా.. మంచి సినిమాలు ఎంచుకుని చేయడం స్టార్ట్ చేసింది. కాని ఎంత టాలెట్ ఉన్నా.. అదృష్టం కూడా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో. పాపం కృతీ ఆతరువాత చేసిన ప్రతీ సినిమా ప్లాప్ అయ్యింది. లక్కీ హీరోయిన్ అనిపించుకునేలోపే.. ఐరన్ లెక్ అనిపించుకుంది కృతీ పాప.
రామ్ తో చేసిన ది వారియర్ సినిమా తో ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి కృతీ శెట్టికి.. ఆతరువాత సుధీర్ బాబుతో చేసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో వెంటనే నాగచైతన్యతో చేసిన కష్టడీ కూడా డిజాస్టర్ అవ్వడంతో.. కృతీ శెట్టి కెరీర్ టాలీవుడ్ లో మూలన పట్టట్టు అయిపోయింది. ఇక ఇప్పుడు తమిళ, మలయాళంలో లక్కును పరీక్షించుకుంటుంది కృతీ శెట్టి.
వరుసగా మూడు ఫ్లాప్స్ అవ్వడం, తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో సెలెక్ట్ అయ్యినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోవడంతో.. ఈ అమ్మడు ఆశలు అన్నిఅడియాశలే అవుతూ వస్తున్నాయి. దీంతో కృతి చేతిలో.. మలయాళంలో టోవినో థామస్ సరసన చేస్తున్న సినిమా ఒకటే మిగిలింది.
ఇక తాజాగా ఇప్పుడు కృతీ శెట్టి మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె ఖాతాలోకి మరో సినిమా వచ్చిపడింది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న జీని సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ ఈరోజు (జులై 5) చెన్నైలో ఘనంగా జరిగింది.
కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవయాని కీలక పాత్రలో నటిస్తుంది. అర్జునన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా ఐసరి, కె గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఇక ఇకనైనా కృతీకి కలిసివస్తుందేమో చూడాలి.