పింక్ శారీలో క్యూట్‌గా మురిపిస్తూ కృతి శెట్టి అదిరే ట్రీట్.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో బేబమ్మ ఎంత అందంగా ఉందో!
టాలీవుడ్‌లో కృతి శెట్టి(Krithi Shetty)ది ప్రత్యేకమైన ప్లేస్. ఆమె పేరు చెబితే ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయిన హీరోయిన్. ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయిన హీరోయిన్. ఇలాంటి కామెంట్లే వినిపిస్తాయి. కానీ కృతి శెట్టి చాలా మంది యంగ్ హీరోయిన్లకి ఓ లెసన్ కూడా.
కృతి శెట్టి `ఉప్పెన` సినిమాతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని హాట్ కేక్ అయ్యింది. ఎగిసిపడే కెరటంలా ఉవ్వెత్తున ఎగిరి పడిపోయింది. ఇప్పుడు ఆది నుంచి మొదలు పెడుతుంది. అందుకు తాను కూడా అందరిలాంటి హీరోయిన్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే నిదర్శనమే ఆమె గ్లామర్ ఫోటోలు.
కృతి శెట్టి ట్రెడిషనల్ లుక్‌లో మెరుస్తూ ఆకట్టుకుంది. మన టైమ్ నడిచినప్పుడు ఎలా ఉన్నా నడిచిపోతుంది. టైమ్ రివర్స్ అయితే కాలాన్నీ ఫాలో కావాలి. లోకం పోకడలను ఫాలో కావాలి. ఇప్పుడు కృతి శెట్టి కూడా అదే చేస్తుంది. గ్లామర్ సైడ్ అలరించే ప్రయత్నం చేస్తుంది.
బేబమ్మKrithi Shetty) కూడా గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. ఆమె ఆ మధ్య మరింత హాట్ డోస్ పెంచుతూ ఫోటో షూట్లు చేసింది. ఇంటర్నెట్‌కి షాకిచ్చింది. అభిమానులను ఆశ్చర్యపరిచింది. బేబమ్మలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలా చేసింది.
అప్పుడప్పుడు ఝలక్ ఇస్తున్నప్పటికీ ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్‌లోనే ఎక్కువగా మెరుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ శారీలో మెరిసింది. పిక్స్ శారీలో ఆకట్టుకుంటుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి క్యూట్‌గా పోజులిచ్చింది. కవ్వింపులకు దిగింది. దీంతో ఇందులో కృతి శెట్టి అందం ఓవర్ లోడ్ అనేలా ఉండటం విశేషం.
కృతి శెట్టి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆమె కామెంట్ చేస్తూ, నవ్వుతూ ఉండాలని, రోజుకి ఒక్కసారైనా ప్రకాశిస్తుండాలని, వెలుగులు పంచాలని తెలిపింది. తన అందంతో ఆమె నెటిజన్లకి వెలుగులు పంచుతుండటం విశేషం.
ఇక సినిమాల్లోకి రాకముందు కృతి శెట్టి యాడ్స్ చేసింది. చైల్డ్ మోడల్‌గా ఆమె చాలా బ్రాండ్ల కి అంబాసిడర్‌గా చేసింది. ఫుడ్, సోప్స్ వంటి ప్రొడక్ట్ లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించింది. క్యూట్ అందాలతో మెప్పించింది.
ఈ క్రమంలో కృతి శెట్టికి `ఉప్పెన` చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమాతో ముగ్గురు వెండితెరకి పరిచయం అయ్యారు. హీరోయిన్‌గా కృతి శెట్టితోపాటు హీరోగా వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు టాలీవుడ్‌కి పరిచయం అవుతూ `ఉప్పెన` చిత్రం చేశారు. ఈ సినిమా కరోనా టైమ్‌లోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది.
దీంతో ఒక్కసారిగా కృతి శెట్టి పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలంతా ఈ అమ్మడు హీరోయిన్‌గా కావాలని పోటీపడ్డారు. తొలి సినిమా హిట్, విపరీతమైన క్రేజ్‌తో కృతి కంగారు పడింది. కన్‌ఫ్యూజన్, ఎగ్జైట్‌మెంట్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనేది మర్చిపోయింది. వచ్చిన ఆఫర్ చేసింది.
వాటి తాలుకూ రిజల్ట్ ని ఫేస్ చేసింది. `ఉప్పెన` తర్వాత కృతి శెట్టి నటించిన రెండు సినిమాలు మాత్రమే యావరేజ్‌గా ఆడాయి. నాని `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్య `బంగార్రాజు` చిత్రాలు మాత్రమే అంతో ఇంతో ఆడాలి. మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో గోల్డెన్ లెగ్ కాస్త ఐరెన్ లెగ్‌లా మారిపోయింది. ఇప్పుడీ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు ఆఫర్ కూడా లేదు.
కన్నడలో, మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ చేరొక మూవీ చేస్తుంది. కానీ టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అదే సమయంలో కొత్తగా వచ్చే హీరోయిన్‌కి ఓ లెసన్‌లా మారింది. ఆచితూచి సినిమాలు చేయాలనే సందేశాన్నిస్తుంది. ఇక తాను అవకాశాల కోసం గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ ని వల వేసే ప్రయత్నం చేస్తుందీ క్యూటీ అందాల సోయగం. ఆఫర్లు వస్తాయేమో చూడాలి.