మనసులో మాట బయట పెట్టిన బేబమ్మ, అదే తన కోరిక అంటున్న కృతీ శెట్టి
టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యేముందు నక్క తోక తోక్కి ఉంటుంది కృతి శెట్టి, వరుస విజయాలు, స్టార్ హీరోల సరసన అవకాశాలు, ఇలా గడిచిపోతోంది మూవీ కెరీర్. సినిమా మీద సినిమా.. హిట్ మీద హిట్ కోడుతూ.. ఫుల్ బిజీ అయిపోయింది కృతీ శెట్టి.

ప్రస్తుతం కృతీ శెట్టికోసం వరుసకడుతున్నారు మేకర్స్. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే.. ఆమె డిమాండ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరుసగా స్టార్స్ పక్కన అవకాశం వస్తుంటే.. ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలో అర్ధం కాక తెగ ఇబ్బంది పడుతోంది బేబమ్మ.
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై దూసుకుపోతున్న కొత్త హీరోయిన్లలో కృతీ శెట్టిది మొదటి స్థానం. ఫస్ట్ మూవీ తొలి సినిమా ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత చేసిన శ్యామ్ సింగ రాయ్ .. బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది కృతీ శెట్టి.
ప్రస్తుతం కృతి శెట్టి నుంచి మరో మూడు సినిమాలు రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి. సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' , నితిన్ జోడీగా నటించిన మాచర్ల నియోజకవర్గం .. అలాగే రామ్ రచ్చ రచ్చ చేస్తూ..ది వారియర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది కృతీ శెట్టి.
ఇక ఇప్పటి వరకూ చేసిన సినిమాలలో విభిన్న పాత్రలు పోషించిన కృతీ శెట్టి, తనకు ఇష్ట మైన పాత్ర గురించి స్పందించింది. తనకు ఏ పాత్ర చేయాలి అని ఉందో చెప్పేసింది. తన డ్రీమ్ రోల్ గురించి మనసులో మాట విప్పేసింది కన్నడ కస్తూరి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. ఇక తెరపై 'రాకుమారి'గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది
కృతీ శెట్టి కోసం స్టార్ హీరోలంతా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలుగుతో పాటు కోలీవుడ్ కన్ను కూడా కృతీ పై పడింది. ఇక ఇక్కడ స్టార్ డమ్ ను ఇలానే కంటీన్యూ చేస్తూ.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని చూస్తోంది కృతీ శెట్టి. ఇప్పటికే ఆమెను వెతుక్కుంటూ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇక ముందు ముందు ఈ లక్కీ లెగ్ హీరోయిన్ ఇంకెన్ని అద్భుతాలు సృస్టిస్తుందో చూడాలి.