MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీర లాగి, బట్టలు చించేసి, కుక్కని వదిలాడు.. నటి గీతాంజలికి నరకం చూపించిన కృష్ణంరాజు..

చీర లాగి, బట్టలు చించేసి, కుక్కని వదిలాడు.. నటి గీతాంజలికి నరకం చూపించిన కృష్ణంరాజు..

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు హీరోగా, విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. కానీ ఓ సినిమా సమయంలో ఆయన గీతాంజలికి నారకం చూపించాడట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 18 2024, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన సూపర్‌ స్టార్స్ లో ఒకరు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత కృష్ణ, శోభన్‌బాబు వంటి వారికి ధీటుగా నటించి మెప్పించారు. యాంగ్రి యంగ్‌ మ్యాన్‌ అనే పదానికి అసలైన అర్థాన్ని తీసుకొచ్చారు. హీరోగానే కాదు, విలన్‌గానూ నటించి అదరగొట్టాడు.  

26

నటుడిగా విలన్‌ పాత్రల్లో అరాచకం చేసిన ఆయన నిజ జీవితంలో ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎవరికీ హాని తలపెట్టేవారు కాదు, అందరితోనూ ప్రేమగా ఉండేవారు. అంతేకాదు స్టార్స్ ని సైతం తన ఇంటికి ఆహ్వానించి పసందైన విందు భోజనంతో ఖుషి చేసేవారు. అదే అలవాటు ఇప్పుడు ప్రభాస్‌కి వచ్చిందనే విషయం తెలిసిందే. వారిది రాజుల ఫ్యామిలీ. ఇలాంటివి వారి ఫ్యామిలీలో భాగమనే చెప్పాలి. 
 

36

అంతటి మంచివాడైన కృష్ణంరాజు.. నటి గీతాంజలిని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడట. ఇంకా చెప్పాలంటే నరకం చూపించాడట. అందరి ముందు తన చీర లాగి బట్టలు చించి, తన కుక్కని ఆమె మీదికి వదిలాడట. ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా కుక్కలు చించిన విస్తారులా అవుతుందో అని చెప్పి బెదిరించాడట. అదే చేసి చూపించాడట. మరి ఇంతకి ఏం జరిగింది, గీతాంజలిని ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాడనేది చూస్తే. 
 

46

గీతాంజలి `మంచి రోజులు వచ్చాయి` సినిమాలో నటించారు. నాగేశ్వరరావు హీరో. హీరోయిన్‌గా కాంచనగా నటించగా, ఏఎన్నార్‌కి చెల్లి పాత్రలో గీతాంజలి నటించారు. కృష్ణంరాజు నెగటివ్‌ రోల్‌ చేశారు. ఇందులో ఓ సీన్‌లో గీతాంజలిని కృష్ణంరాజు ఇబ్బంది పెట్టాలి. ఓ రకంగా అది రేప్‌ సీన్‌. ఆ సన్నివేశం చేసేటప్పుడు గీతాంజలి నిజంగానే నరకం అనుభవించిందట. 
 

56

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, కృష్ణంరాజుపై గీతాంజలి ఉమ్మేయాల్సి ఉంటుంది. వామ్మో ఉమ్మడమా ? అని షాక్‌ అయ్యిందట గీతాంజలి. నా వల్ల కాదని చెప్పిందట. లేదు కచ్చితంగా చేయాల్సిందే అని దర్శకుడు మధుసూధన రావు. దీంతో ఐస్‌ క్రీమ్‌ని నోట్లో వేసుకుని ఆ నూరగని ఉమ్మిందట. దీంతో కోపానికి గురైన కృష్ణంరాజు నాపైనే ఉమ్మేస్తావా? ఇప్పుడు చూడు నీ పని ఏమైతుందో అని, ఆమెపై పడి చీర లాగి, బట్టలన్నీ చించేసి చుట్టూ అంతా నలిపేసి ఆగమాగం చేశాడట. చివరికి కుక్కని కూడా తనపైకి వదిలాడట. 
 

66

ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా చించిన విస్తారులా మారుతుందో అని చెప్పి ఆ పని చేశాడట. అయితే సినిమా సీనే అయినా నిజంగానే గీతాంజలి చాలా ఇబ్బంది పడిందట. ఆ సీన్‌ చేసేటప్పుడు ఓ రకంగా నరకం చూసిందట. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సీన్‌ అని వెల్లడించింది గీతాంజలి. సాక్షితో కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. గీతాంజలి నటుడు రామకృష్ణని పెళ్లి చేసుకుంది. ఆయన 2001లో చనిపోయారు. గీతాంజలి 2019లో అక్టోబర్‌ 31న కన్నుమూశారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved