- Home
- Entertainment
- ఆ ఛండాలం అయితే ఒప్పుకోను..మహేష్ విషయంలో కృష్ణ, కృష్ణవంశీ మధ్య గొడవ జరిగిందా,చివరికి ఏం తేలిందంటే..
ఆ ఛండాలం అయితే ఒప్పుకోను..మహేష్ విషయంలో కృష్ణ, కృష్ణవంశీ మధ్య గొడవ జరిగిందా,చివరికి ఏం తేలిందంటే..
మహేష్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన మురారి చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. శనివారం ఫిబ్రవరి 17 తో ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు గడిచింది.

మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్ పై సత్తా చాటే సమయం వచ్చేసింది. అభిమానులంతా రాజమౌళి, మహేష్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ హీరోలని తలదన్నే లుక్స్ తో మహేష్ ఇప్పటివరకు లోకల్ మార్కెట్ ని దున్నేశాడు. రాజమౌళి చిత్రం మహేష్ స్టామినాకి , నటనకి సరిపడే చిత్రం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాసేపు ఇందంతా పక్కన పెడితే మహేష్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన మురారి చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. శనివారం ఫిబ్రవరి 17 తో ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు గడిచింది. దీనితో ఫ్యాన్స్ మురారి చిత్ర విశేషాలని మరోసారి గుర్తు గుర్తు చేసుకుంటున్నారు.
కృష్ణవంశీ దర్శకత్వం, మహేష్ బాబు నటన, సోనాలి బింద్రే గ్లామర్ వీటితో పాటు మణిశర్మ సంగీతం..సిరివెన్నెల అందించిన లిరిక్స్ ఈ చిత్రాన్ని ఆల్ టైం క్లాసిక్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో క్లైమాక్స్ కి ముందు వచ్చే పెళ్లి సాంగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. అలనాటి రామచంద్రుడు పాట లేనిదే తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి ఉండదు అని చెప్పడం లో అతిశయోక్తి కాదు.
ఈ సాంగ్ వెనుక పెద్ద కథే ఉంది. క్లైమాక్స్ లో ఈ పాట పెట్టాలని కృష్ణ వంశీ సిద్ధం అయ్యారు. కానీ నిర్మాత రామలింగేశ్వర రావు.. సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. క్లైమాక్స్ లో ఇలాంటి సాంగ్ పెడితే ఇదేదో పౌరాణిక చిత్రం లా ఉందని.. మాస్ ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పారట. కృష్ణ అయితే మాస్ సాంగ్ పెట్టాల్సిందే అని పట్టు పట్టారట.
దీనితో కృష్ణవంశీ ఆ ఛండాలం నేను చేయను. ఒకవేళ మాస్ సాంగ్ కావాలంటే నేను ఇప్పుడే పక్కకి తప్పుకుంటా. మీరు మాస్ సాంగ్ పెట్టుకుని సినిమా రిలీజ్ చేసుకోండి. దర్శకుడిగా నా పేరు కూడా వేయొద్దు అని తేల్చి చెప్పారట. దీనితో దర్శకుడు ఇంతగా ఆ పాటని నమ్ముతుండడంతో కృష్ణ కాదనలేక పోయారు. కృష్ణ వంశీ తాను అనుకున్నట్లుగా సాంగ్ ని షూట్ చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత కృష్ణ కూడా అభిందించారట.
కృష్ణ వంశీ బెస్ట్ వర్క్ లో మురారి చిత్రం కూడా ఒకటి. మహేష్ బాబు ఈ చిత్రంతో స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం మహేష్ ని నటుడిగా మరో స్థాయికి చేర్చింది.