- Home
- Entertainment
- Krishna Mukunda Murari: అసలు విషయం చెప్పి కృష్ణకి షాకిచ్చిన రేవతి.. ముకుందని అవమానించిన కృష్ణ!
Krishna Mukunda Murari: అసలు విషయం చెప్పి కృష్ణకి షాకిచ్చిన రేవతి.. ముకుందని అవమానించిన కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండి టాప్ రేటింగ్ ని సంపాదిస్తుంది. సంవత్సరంలో తనని వదిలి వెళ్ళిపోతున్న భార్య మీద అపారమైన ప్రేమని పెంచుకుంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మా వదిన చెప్పినట్లు చేయు అంటూ భార్యని కోప్పడతాడు ఈశ్వర్. భవానికి సారీ చెప్పి ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. మన ఇంటి ఆడపిల్ల కోసం మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇంత కష్టపడుతుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అర్థం కాకపోయినా నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి.మరోవైపు కృష్ణ తలకి సాంబ్రాణి వేసుకుంటూ ఉంటే మురారి వచ్చి హెల్ప్ చేస్తాడు. మీరు ఒక పెద్ద ఆఫీసర్ ఇలాంటివి చేయకూడదు అంటుంది కృష్ణ. అలా అని రూల్ ఏమీ లేదు కదా అంటాడు మురారి.
నాకేం కావాలో నేను చూసుకుంటాను అంటుంది కృష్ణ. క్షమించే వరకు నిన్ను బాగా చూసుకోవాలి కదా అంటాడు మురారి. ఇంతలోనే రేవతి వచ్చి కృష్ణ కి మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్తుంది. మురారి గుడ్ మార్నింగ్ చెప్పినా పట్టించుకోదు. ఏం జరిగింది అంటాడు మురారి. నా కోడల్ని అవమానించిన రోజే నీ మీద ద్వేషం పెరిగింది అంటుంది రేవతి. ఆ ద్వేషం ఎలా పోతుంది అంటాడు మురారి. నా కోడలు క్షమించేదాకా పోదు అంటుంది రేవతి. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నన్ను ఆడేసుకోండి అంటాడు మురారి. నువ్వు చేసింది తప్పు కాదా అంటూ కేకలు వేస్తుంది రేవతి. ఆయనతో మనకేంటి మాటలు ఇంతకు మీరు వచ్చిన విషయం ఏంటి అని అడుగుతుంది కృష్ణ.
నందినిని అమెరికాకి పంపిస్తున్న విషయం చెప్తుంది రేవతి. ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ.ఈ విషయంలో నిన్ను జోక్యం చేసుకోవద్దు అంటున్నారు అని రేవతి చెప్పడంతో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది అంటాడు మురారి. అసలు విషయం మీ ఆయనకు చెప్పలేదా అంటుంది రేవతి. ఎంతైనా మగాడు కదా, ముందే అపార్థం చేసుకున్నారు అందుకే ఏమీ చెప్పలేదు అంటుంది కృష్ణ.
అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ అయోమయంగా అడుగుతాడు మురారి. ముందు భార్యని గౌరవించడం నేర్చుకో అంటూ మందలిస్తుంది రేవతి. మరి డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు అంటాడు మురారి. పోరా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి. అసలు ఏం జరుగుతుంది, మా మమ్మీ నీకు ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తుంది.
నందినిని అమెరికాకి తీసుకు వెళ్తే మీ ఇద్దరికీ ఏంటి ప్రాబ్లం అంటూ నిలదీస్తాడు. జరిగిందంతా చెప్తాను నాతోపాటు హాస్పిటల్ కి రండి అంటుంది కృష్ణ. మెంటల్ ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నట్లుగా వీసా కి అప్లై చేశాను. వన్ వీక్ లో వీసా కన్ఫర్మ్ చేస్తానన్నారు అంటూ వదినకి చెప్తాడు ఈశ్వర్. మన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వీసా కన్ఫర్మ్ అయ్యేలాగా చూడు ఉంటుంది భవాని.
టీపాయ్ మీద ఉన్న ఫైల్ చూసి ఇంత నిర్లక్ష్యంగా ఈ ఫైల్ ని ఎక్కడ వదిలేసావు ఆ ఫింగర్ పిల్ల చూసిందంటే మళ్ళీ హడావుడి చేస్తుంది అసలే రేవతి ఈ విషయాన్ని కృష్ణకి చెప్పేసి ఉంటుంది అంటుంది భవాని. కృష్ణని అంతా తక్కువ ఉంచటం వేయటానికి వీల్లేదు నాకు తెలిసి ఇతనికి ఇప్పటికే అంత తెలిసిపోయి ఉంటుంది. అందుకోసమే గౌతమ్ ని మన ఇంటికి లంచ్ కి పిలిచి ఉంటుంది.
అయినా సరే తగ్గేది లేదు ఈసారి నేను వేయబోయే ఎత్తు కృష్ణ ఊహకి కూడా అందదు అంటుంది భవాని. మరోవైపు ముకుంద దగ్గరికి వచ్చి మురారి బావగారు బయటకి వెళ్ళినప్పుడు చెప్పమన్నావు కదా ఆయన బయలుదేరుతున్నారు అంటూ చెప్పటంతో కంగారుగా బయలుదేరుతుంది ముకుంద. కృష్ణ వస్తుందని ఎదురుచూస్తున్న మురారి కి ముకుంద రావటంతో షాక్ అవుతాడు మురారి. వస్తూనే కార్ స్టార్ట్ చేయమంటుంది ముకుంద.కృష్ణ వస్తుంది అని చెప్పి వేరే కార్లో వెళ్ళమంటాడు మురారి. నేను అనుకున్నది జరగకపోతే నా సంగతి తెలుసు కదా అంటూ బెదిరిస్తుంది ముకుంద. కృష్ణ నాతో ఏదో మాట్లాడాలంట నువ్వుంటే ప్రైవసీ ఉండదు అంటాడు మురారి.
నాలుగు రోజుల పోతే కృష్ణ వెళ్ళిపోతుంది అప్పుడు ఏం చేస్తావు అంటుంది ముకుంద. జరగని వాటి గురించి ఆలోచించను అంటాడు మురారి.అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణ వెళ్దామా అని అడుగుతుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు మురారి.నేను కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నాను మురారిని డ్రాప్ చేయమంటే నువ్వు వచ్చేవరకు వెయిట్ చేయమన్నాడు అంటుంది ముకుంద. ముందు ముకుందని డ్రాప్ చేసి తర్వాత మనం హాస్పిటల్ కి వెళ్దాము అంటుంది కృష్ణ. కుదరదు అంటాడు మురారి.10 నిమిషాల్లో పోయేదేముంది రానివ్వండి అంటుంది కృష్ణ. సరే అయితే నువ్వు ముందు సీట్లో కూర్చో అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు మురారి.
తరువాయి భాగంలో నువ్వు ఎక్కడ దిగాలి అని అడుగుతుంది కృష్ణ. నిన్ను డ్రాప్ చేసి నేను మురారి వెనక్కి వచ్చేస్తాను అంటుంది ముకుంద. మురారిని కారు ఆపమని ముకుందని మధ్యలోనే దిగిపోమంటుంది కృష్ణ. ఎందుకు అని ముకుందా అడిగితే మేమిద్దరం బయలుదేరినప్పుడు మధ్యలో వస్తాను అనటమే తప్పు టైంపాస్ చేయకుండా దిగిపో అంటుంది కృష్ణ.