వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య చిచ్చు పెట్టిన కృష్ణ భగవాన్..రాత్రి తాను లేని సమయంలో ఇంటికి రావడంపై నిలదీత..
`ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలో వర్ష, ఇమ్మాన్యుయెల్ జోడీకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఆ క్రేజ్ తగ్గింది. లవ్ స్టోరీలకు దూరంగా ఉంటూ రెగ్యూలర్‌గా చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
extra jabardsath promo
`జబర్దస్త్` వర్ష(Varsha), ఇమ్మాన్యుయెల్(Emmanuel).. క్రేజీ జంటగా రాణిస్తుంది. అంతకు ముందు రష్మి- సుధీర్ ల తర్వాత ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ పాపులర్ అయ్యింది. స్టేజ్‌పై తన ప్రేమని వ్యక్తం చేస్తూ, నువ్వు లేక నేను లేను అనేంతగా డ్యూయెట్లు పాడుకున్నారు. అలాగే స్కిట్లు చేశారు. లవ్ ప్రపోజల్స్ చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కి వెళ్లారు. కొన్ని సార్లు పెళ్లి పీఠలు కూడా ఎక్కారు.
extra jabardsath promo
ఇలా ఒకరిపై ఒకరు కామెంట్లు, సెటైర్లతో ప్రచారంలో నిలుస్తున్నారు. అందరిని ఆకట్టుకుంటున్నారు. తరచూ జబర్దస్త్ షోలో కంటెంట్ ఇచ్చే ఈ బ్యాచ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. దానికి కారణం జడ్జ్ కృష్ణ భగవాన్. ఆయన చేసిన పని ఇప్పుడు వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య చిచ్చుపెట్టింది. అర్థరాత్రి ఆయన వీరి ఇంటికి వెళ్లడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.
extra jabardsath promo
ఇందులో రాత్రి కృష్ణ భగవాన్ మనింటికి ఎందుకు వచ్చాడని వర్షని నిలదీశాడు ఇమ్మాన్యుయెల్. దానికి వర్ష రియాక్ట్ అవుతూ.. ఆయన అడ్రెస్ మర్చిపోయి మన ఇంటికి వచ్చాడంటా అని చెప్పింది.
extra jabardsath promo
దీనికి ఇమ్మాన్యుయెల్ ఇచ్చిన రియాక్షన్ క్రేజీగా ఉంది. రాత్రి తాను తాగనని చెప్పినా కూడా బలవంతంగా తాగించాడట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను తాగనని చెప్పినా, మరీ తాగించింది నైట్ మా ఇంటికి రావడానికా మీరు? అని నిలదీశాడు ఇమ్మాన్యుయెల్.
extra jabardsath promo
అనంతరం మరోసారి వర్షని నిలదీశాడు ఇమ్మాన్యుయెల్..దీంతో వర్ష మాట మార్చింది. ఆయన చాలా మంచోడండి అని తెలిపింది. అయినా ఇమ్మాన్యుయెల్ వినలేదు. ఆయన మంచోడే, ఆయన్ని నేను అనుమానించడం లేదని, కానీ నువ్వే.. అనే అర్థం వచ్చేలా ఆయన సైగల్ చేస్తూ వర్షని అనుమానించడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.
extra jabardsath promo
ఇది తాజాగా విడుదలైన `ఎక్స్ ట్రా జబర్దస్త్`(Extra Jabardasth Promo) ప్రోమోలోని స్కిట్. తాజాగా రిలీజ్ ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇందులో వర్ష, ఇమ్మాన్యుయెల్ స్కిట్ నవ్వులు పూయిస్తుంది. ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత మరోసారి ఈ ఇద్దరు మంచి కంటెంట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇది ఈ శుక్రవారం ఈటీవీలో ప్రసారం కానుంది.