MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొండ పొలం ట్విట్టర్ రివ్యూ: అవార్డ్ విన్నింగ్ మూవీ అంటున్న మెగాస్టార్, నెటిజెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్

కొండ పొలం ట్విట్టర్ రివ్యూ: అవార్డ్ విన్నింగ్ మూవీ అంటున్న మెగాస్టార్, నెటిజెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్

మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న రెండవ చిత్రం కొండ పొలం. వైష్ణవ్ మొదటి చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో పాటు, క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కించిన మూవీ కావడంతో కొండ పొలం మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 08 2021, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పవన్ కళ్యాణ్ తో క్రిష్ భారీ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే గ్యాప్ లో క్రిష్, Vaishnav tej తో కొండ పొలం చిత్రాన్ని నిర్మించారు. ఇక Konda polam review మూవీ ఎలా ఉంది, మన నెటిజెన్స్ కామెంట్స్ ఏమిటని పరిశీలిస్తే... ప్రేక్షకులు చిత్రం పట్ల పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవల ఆధారంగా కొండపొలం మూవీ తెరకెక్కించారు. నేడు Konda polam వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఓ సామాజిక వర్గం జీవన విధానాన్ని కమర్షియల్ అంశాలు జోడించి క్రిష్ కొండ పొలం తెరకెక్కించారు. గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథ మధ్య అల్లి చెప్పారు. అదే సమయంలో అడవిలో గొర్రెలు కాపరులకు ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు, వ్యతిరేక శక్తుల గురించి క్రిష్ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 

37

మంచి చదువు వుండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, సాంప్రదాయ కుటుంబ గొర్రెల కాపరిగా మారిన యువకుడిగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తుండగా, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయిగా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. రెండు ఇన్నోసెంట్ ప్యూర్ క్యారెక్టర్స్ మధ్య, ప్రకృతిలో నడిచే అందమైన ప్రేమ కథ, సినిమాలో ప్రధానంగా నడిచినట్లు తెలుస్తుంది. 

47

ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో కొండ పొలం సాగినట్లు ట్విట్టర్ కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది. కొండ పొలం మూవీకి సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్, బాగా ప్లస్ అయ్యింది. పాటలతో పాటు బీజీఎమ్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. 

57


కొండ పొలం మూవీపై మెగాస్టార్ చిరంజీవి మొదటి రివ్యూ ఇచ్చారు. ఆయన నిన్న రాత్రి సతీసమేతంగా స్పెషల్ స్క్రీన్ ద్వారా కొండ పొలం వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయం తెలియజేశారు. 

67

చ‌క్క‌టి ర‌స్టిక్ ల‌వ్‌స్టోరి. ఈ ప్ర‌కృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన క‌థాంశం. మంచి మెసేజ్‌తో కూడిన ల‌వ్‌స్టోరి. ఆర్టిస్టుల విష‌యానికి వ‌స్తే వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ నటన బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆహ్వానించాలి, ఆద‌రించాలి. ‘కొండ‌పొలం’ మూవీ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాను.దర్శకుడు క్రిష్‌ తో పాటు నిర్మాత‌ల‌కు, వైష్ణ‌వ్, ఇత‌రుల‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు Chiranjeevi.

77

అలాగే ఇలాంటి కథలను ఎంచుకుని, అద్భుతంగా తెరకెక్కించడం ఒక్క Krish కి మాత్రమే సాధ్యం. ఆర్టిస్టుల నుండి ఆయన గొప్ప నటన రాబడతారు. కొండ కొండ పొలం ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ మూవీ, అని తెలిపారు. హీరో, హీరోయిన్ ని సైతం సైతం ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి సినిమా పట్ల పాజిటివ్ రివ్యూ ఇవ్వగా, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో కొండ పొలం థియేటర్స్ లో విడుదల కానుంది. 

 

Also read ప్రభాస్ లాగా కొట్టాలనిపిస్తుంది, కానీ.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేసిన వైష్ణవ్

ఒంటిపై బట్టలు తీసేసి, సిగ్గుతో ముఖం దాచుకుంటున్న పూజా, క్లీవేజ్ షో చూసి టెంప్టింగ్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image2
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image3
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved