పవన్.. నీ వెంట నేను నడుస్తా.. వైజాగ్ ఉద్రిక్తతపై హీరోయిన్ సంచలన ట్వీట్
జనసేనాని పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగుతోంది. జనవాణి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ నోవొటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగుతోంది. జనవాణి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ నోవొటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు. దీనితో నిన్నటి నుంచి నోవొటెల్ హోటల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
వందలాది మంది పోలీసులని ప్రభుత్వం హోటల్ వద్ద మోహరించింది. చాలా మంది జనసేన నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. దీనితో జనసేన కార్యకర్తలు నోవొటెల్ వద్ద చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ, సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
పోలీసులు పవన్ కళ్యాణ్ ఎలాంటి మీటింగులు నిర్వహించడానికి వీలు లేదని నోటీసులు అందించారు. దీనితో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో.. నేను సాయంత్రం ఆర్కే బీచ్ లో మంచి గాలి పీల్చుకోవడానికి వాకింగ్ చేయవచ్చా అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కి కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ స్పందించింది. నేనూ నీ వెంట నడుస్తా అంటూ నికీషా పవన్ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ తో కలసి ఒక్క చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న నికీషా పటేల్.. పాలిటిక్స్ తో ఏ సంబంధం లేకున్నా ఆయనకి సపోర్ట్ గా నిలిచింది.
దీనితో పవన్ అభిమానులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు. 2010లో విడుదలైన కొమరం పులి చిత్రంలో పవన్, నికీషా జంటగా నటించారు.
ఆ తర్వాత నికీషా పటేల్ కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నికీషా నటించింది. నికీషా గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.