ఎఫైర్ పెట్టుకొని ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేస్తున్న హీరో జై... విసుగెత్తిపోయిన ఆమె?
జర్నీ, రాజు రాణి చిత్రాలతో తెలుగువారికి కూడా దగ్గరయ్యాడు హీరో జై. ఈ కోలీవుడ్ టైర్ టూ హీరో కారణంగా యంగ్ హీరోయిన్ కెరీర్ ప్రమాదంలో పడిందట. విసుగెత్తిన ఆ భామ బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నారట..

Vani bhojan
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన వాణీ భోజన్ హీరోయిన్ గా మారారు. 2010లో విడుదలైన హారర్ మూవీ 'ఓరు ఏరావు' తో వెండితెరకు పరిచయం అయ్యారు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాణీ భోజన్ అఫైర్ రూమర్స్ తో కెరీర్ నాశనం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్. హీరో జై తో సహజీవనం చేస్తున్న వాణీ తన కెరీర్, లైఫ్ అతడి చేతిలో పెట్టేసిందట.
వాణీ భోజన్ డేట్స్, కాల్ షీట్స్, రెమ్యూనరేషన్ ఇలా ప్రతి విషయం హీరో జై చూసుకుంటున్నాడట. ఏదైనా ఆఫర్ విషయమై దర్శక నిర్మాతలు మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుందట. ముందుగా హీరో జై ని సంప్రదించాల్సి వస్తుందట. ఇదంతా నచ్చని కొందరు ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదట. ఆఫర్ ఇద్దామనే ఆలోచన కూడా వెన్నక్కి తీసుకుంటున్నారట.
ఇది గమనించిన వాణి కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం వ్యక్తం చేస్తుందట . జై కి బ్రేకప్ చెప్పి వదిలించుకోవడమే బెటర్ అని భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.
గతంలో జై తెలుగు భామ అంజలితో ఎఫైర్ నడిపారు. జర్నీ మూవీలో మొదటిసారి ఈ జంట కలిసి నటించారు. అప్పటి పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. చాలా ప్రేమ కథల్లాగే ఇది కూడా మధ్యలో ముగిసింది. అంజలితో బ్రేకప్ తర్వాత జై హీరోయిన్ వాణి భోజన్ కి దగ్గరయ్యారు.
Vani bhojan
వాణి తెలుగులో ''మీకు మాత్రమే చెప్తా'' చిత్రంలో నటించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ పర్వాలేదనిపించుకుంది. 2020లో విడుదలైన ఓ మై కడవలే వాణికి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓ మై కడవలే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా వాణి నటించారు.
vani bhojan
ప్రస్తుతం ఆమె కెరీర్ జోరుగా ఉంది. పది చిత్రాలకు పైగా ఆమె ఖాతాలో ఉన్నాయి. కోలీవుడ్ లో ఆమె స్టార్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. ఎదిగే తరుణంలో ఎఫైర్, వివాదాలతో ఆమె భవిష్యత్తు నాశనం చేసుకుంటుంది. ఇకనైనా ఈ యంగ్ బ్యూటీ మేలుకుంటే బెటర్.