MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kollywood Report 2026: సూర్య, అర్జున్‌ కమ్‌ బ్యాక్‌.. బోల్తా పడ్డ ధనుష్, ప్రదీప్.. కోలీవుడ్ 6 నెలల రిపోర్ట్

Kollywood Report 2026: సూర్య, అర్జున్‌ కమ్‌ బ్యాక్‌.. బోల్తా పడ్డ ధనుష్, ప్రదీప్.. కోలీవుడ్ 6 నెలల రిపోర్ట్

Kollywood Report 2026: 2026 సంవత్సరం మొదలై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఫస్టాఫ్‌లో కోలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది? ఏ సినిమాలు హిట్టయ్యాయి, ఏవి ఫ్లాపయ్యాయో  ఇందులో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కోలీవుడ్‌ 6 నెలల బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X

కోలీవుడ్‌ 6 నెలల బాక్సాఫీసు రిపోర్ట్

2026 సంవత్సరం గడిచి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల్లో తమిళ సినిమా ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూసింది. విశేషం ఏంటంటే, భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బోల్తా కొట్టాయి. కానీ, చిన్న బడ్జెట్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 2026 ప్రథమార్థంలో రిలీజైన సినిమాల్లో ఏది హిట్‌? ఏది ఫట్‌ అనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జనవరి రిపోర్ట్
Image Credit : Dawn Pictures, Kannan Ravi Productions, Studio Green

జనవరి రిపోర్ట్

జనవరిలో పొంగల్ బరిలో శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా రిలీజైంది. ఇది మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీనికి పోటీగా వచ్చిన కార్తి 'వా వాత్తియారే' డిజాస్టర్‌గా నిలిచింది. కానీ, అదే రేసులో వచ్చిన జీవా 'తలైవర్ తంబి తలైమైయిల్' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత అజిత్ 'మంకథా' రీ-రిలీజై మంచి ఆదరణ పొందింది. 'హాట్ స్పాట్ 2' కూడా జనవరి చివర్లో విడుదలై సక్సెస్ సాధించింది.
37
ఫిబ్రవరి రిపోర్ట్
Image Credit : Passion Studios

ఫిబ్రవరి రిపోర్ట్

ఫిబ్రవరి నెలలో చిన్న బడ్జెట్ సినిమాలే రిలీజయ్యాయి. మొదటి వారంలో రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన 'విత్ లవ్' వచ్చింది. అభిషన్ జీవింత్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.39 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్టయింది. తర్వాత వచ్చిన 'పూకి', 'మై లార్డ్' ఫ్లాపయ్యాయి. నెల చివర్లో వచ్చిన రాధిక 'తాయ్ కిళవి' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి రూ.82 కోట్లు కొల్లగొట్టింది.

47
మార్చి నెల రిపోర్ట్
Image Credit : Asianet News

మార్చి నెల రిపోర్ట్

మార్చి నెలలో తమిళనాడులో ఒక్క పెద్ద బడ్జెట్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయినా, ఆ నెలలో వచ్చిన కెన్ కరుణాస్ 'యూత్' సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.72 కోట్లు వసూలు చేసి దుమ్మురేపింది. ఆ తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'హ్యాపీరాజ్' సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా, కేవలం రూ.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
57
ఏప్రిల్‌లో బాక్సాఫీసు రిజల్ట్
Image Credit : Instagram

ఏప్రిల్‌లో బాక్సాఫీసు రిజల్ట్

ఏప్రిల్ నెలలో తమిళనాడులో ఎన్నికలు జరిగినా, కొన్ని పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. ముఖ్యంగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఏప్రిల్ 10న విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ నెల చివర్లో వచ్చిన ధనుష్ 'కర' సినిమా కూడా వచ్చినంత వేగంగానే వెనక్కి వెళ్లిపోయింది. అప్పుడు ప్రజలంతా రాజకీయాలపై దృష్టి పెట్టడమే దీనికి కారణం.
67
మే నెల రిపోర్ట్
Image Credit : X

మే నెల రిపోర్ట్

మే నెలలో తమిళ సినిమాకి ప్రాణం పోశారు సూర్య, అర్జున్‌. ఆ నెలలో రిలీజైన సూర్య 'కరుప్పు', అర్జున్ 'బ్లాస్ట్' సినిమాలు రెండూ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాలు వాళ్లిద్దరికీ అదిరిపోయే కంబ్యాక్‌గా నిలిచాయి. ఇందులో 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద రూ.310 కోట్లు కొల్లగొట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే అర్జున్ 'బ్లాస్ట్' సర్ప్రైజ్ హిట్టయి రూ.75 కోట్లు వసూలు చేసింది.

77
జూన్‌ బాక్సాఫీసు రిజల్ట్
Image Credit : X

జూన్‌ బాక్సాఫీసు రిజల్ట్

జూన్ ఆరంభంలో పాండిరాజ్ దర్శకత్వంలో 'పరిమళా అండ్ కో' సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్లు వసూలు చేసి హిట్ లిస్ట్‌లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 'హబీబీ', 'డబుల్ ఆక్యుపెన్సీ' చిత్రాలకు మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లు రాలేదు. జూన్ చివర్లో వచ్చిన విజయ్ ఆంటోనీ 'నూరు సామి', సమంత ‘ఎంగళ్ తంగం’(మా ఇంటి బంగారం) , అర్జున్ దాస్ 'ఖాన్ సిటీ' సినిమాలు మంచి టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. సమంత మూవీ తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. తమిళంలోనూ మంచి వసూళ్లు రావడం విశేషం. మొత్తంగా తమిళ సినిమాని ఈ హాఫ్‌ ఇయర్‌లో సూర్య, అర్జున్‌, రాధికా, కెన్‌ కరుణాస్‌ వంటి వారు దుమ్ములేపారని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Recommended image2
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image3
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Related Stories
Recommended image1
Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Recommended image2
Brigida Saga: స్టార్‌ డైరెక్టర్‌ కి హ్యాండిచ్చిన హీరోయిన్‌.. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved