నయనతార చెల్లెల్లు తాన్యా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో మూవీలో నటించిన నటీనటులకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార చెల్లిగా చేసిన తాన్యా రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

Tanya Ravichandran
గాడ్ ఫాదర్ మూవీలో నయనతార పవర్ ఫుల్ రోల్ చేశారు. లేడీ పొలిటీషియన్ గా అదరగొట్టారు. కాగా ఈ మూవీలో నయనతార చెల్లి పాత్ర చేశారు తాన్యా రవిచంద్రన్. తన పాత్ర పరిధిలో మెప్పించిన తాన్యా గాడ్ ఫాదర్ మూవీతో తెలుగు ఆడియన్స్ మైండ్స్ లో రిజిస్టర్ అయ్యారు. మొదటిసారి ఆమెకు టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ ఫేమ్ తెచ్చిపెట్టింది.
Tanya Ravichandran
అదే సమయంలో ఎవరీ తాన్యా అంటూ ఆరా తీస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ గురించి చెప్పాలంటే... ఆమెది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె తాతగారు రవిచంద్రన్ పెద్ద నటుడు. కెరీర్ లో హీరో కూడా చేశారు. అనేక తమిళ చిత్రాల్లో రవిచంద్రన్ నటించారు. మలేషియాకు చెందిన తమిళ నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
Tanya Ravichandran
ఇక తాన్యా తల్లిగారు లావణ్య శ్రీరామ్ క్లాసికల్ డాన్సర్. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్ళకు భరతనాట్యం నేర్పారు. టీనేజ్ లో ఉండగా తాన్యా తన సిస్టర్ తో పాటు స్టేజ్ షోలు ఇచ్చారట. ఆ విధంగా ఆమె సినిమా పట్ల మక్కువ పెంచుకున్నారు. హీరోయిన్ కావాలని పరిశ్రమకు రావడం జరిగింది.
Tanya Ravichandran
2016లో విడుదలైన బల్లె వెళ్ళైయతేవా చిత్రంతో తాన్యా వెండితెరకు పరిచయం అయ్యారు. అనంతరం బృందావనం, కరుప్పన్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె కార్తికేయకు జంటగా రాజా విక్రమార్క చిత్రం చేశారు. ఆ మూవీ ఆశించిన విజయం సాదించకపోవడంతో తాన్యాకు గుర్తింపు రాలేదు.
Tanya Ravichandran
మళ్ళీ గాడ్ ఫాదర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. జాన్వీగా తాన్యా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గాడ్ ఫాదర్ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. ప్రస్తుతం తాన్యా చేతిలో రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Tanya Ravichandran
అగిలాన్, మాయన్ 2 చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. అగిలాన్ మూవీ చిత్రీకరణ పూర్తి కాగా, మాయన్ సెట్స్ పై ఉంది. పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్న తాన్యాకు బ్రేక్ ఇచ్చే ఆఫర్ ఇంకా తగల్లేదు. చిన్న చిత్రాల్లో మాత్రమే హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నాయి. మరి తాన్యా కెరీర్ లో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.