మిరాయ్‌తో పోటీ పడుతున్న కిష్కిందపురి.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Kishkindhapuri Collection: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన హార్రర్-థ్రిల్లర్ మూవీ కిష్కిందపురి. సెప్టెంబర్ 12న విడుదలై మూవీ తేజా సజ్జా ‘మిరాయ్’ పోటీని తట్టుకోగలిగిందా? ఈ మూవీ ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది?

మిరాయ్‌తో పోటీ పడుతున్న కిష్కిందపురి
Kishkindhapuri Collection:టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లెటేస్ట్ మూవీ కిష్కిందపురి (Kishkindhapuri).ఈ హార్రర్-థ్రిల్లర్ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ జంట రాక్షసుడు అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కిష్కిందపురి చిత్రం షైన్ స్క్రీన్ బ్యానర్‌లో నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. తేజా సజ్జా మిరాయ్ పోటీని తట్టుకోగలిగిందా? హార్రర్-థ్రిల్లర్ ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూలు చేసింది? అనే వివరాల్లోకెళ్తే..
లాభాల బాటలో
వాస్తవానికి కిష్కిందపురి మూవీ తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో కలెక్షన్ల పరంగా నిరాశపరిచిన కిష్కింధపురి రెండో రోజు నుంచే కలెక్షన్లు పెరిగాయి. మూడో రోజు వరకు బుకింగ్స్ క్రమంగా పెరుగుతూ, అడ్వాన్స్ బుకింగ్స్ తో హౌస్‌ఫుల్ షోలు నమోదు అయ్యాయి. నిర్మాణ, నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులను కలిపి రూ. 35కోట్ల బడ్జెట్ తో నిర్మింబడిన ఈ సినిమా ఈ మూడు రోజుల్లోనే నైజాం , ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలను సంపాదించింది. ఇప్పటికే ఏపీ అండ్ తెలంగాణలో సుమారు 90% బడ్జెట్ రికవరీ అయ్యి, త్వరలో అక్కడ కూడా లాభాల్లోకి వెళ్లనున్నట్లు టాక్.
బెల్లంకొండ శ్రీనివాస్ కమ్ బ్యాక్
అలాగే, హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన అద్భుతమనే చెప్పాలి. తన యాక్టింగ్ తో ఇరగదీశారు. థియేటర్లలో 10 నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఫోన్ పట్టుకుంటే సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోతాడనని పేర్కొన్న స్టేట్మెంట్ ఇచ్చారంటే.. ఆయనకు సినిమా పై ఉన్న నమ్మకాన్ని ఇదే సాక్ష్యమని చెప్పాలి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించడం, థియేట్రికల్ రైట్స్‌ను మార్జిన్ ధరలకే విక్రయించడం వల్ల ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రెండింటికీ లాభదాయకంగా నిలిచింది.
కలెక్షన్ల జాతర
కిష్కిందపురి కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఓపెనింగ్ డే ఇండియా నెట్ కలెక్షన్ ₹2.15 కోట్లు, రెండవ రోజు ₹2.85 కోట్లు, మూడవ రోజు ₹3.50 కోట్లు వసూల్ చేయగా, మొత్తం 3 రోజుల ఇండియా నెట్ కలెక్షన్ ₹8.20 కోట్లు కొల్లాగొట్టింది. ఓవర్సీస్‌లో కూడా ₹1.75 కోట్లు వసూల్ అయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమాకి రూ.6.01 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.10 కోట్లు రాబట్టింది.
4 వ రోజు కలెక్షన్లు ఇలా...
కిష్కిందపురి 4వ రోజు కలెక్షన్లు చూస్తే.. ఈ హార్రర్ థ్రిల్లర్ కు మంచి మౌత్ పబ్లిసిటీ తో ఫూట్ ఫాల్ పెరిగింది. సాక్నిల్క్ ప్రారంభ అంచనాల ప్రకారం ₹1.65 కోట్లు ఇండియా నెట్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలుగు థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోస్: 23.09 శాతం, మధ్యాహ్నం షోస్: 30.24 శాతం,
సాయంత్రం షోస్: 31.24 శాతం, నైట్ షోస్: 43.73 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది. స్టేట్ వైజ్ కలెక్షన్ల విషయానికి వస్తే, ఏపీ, తెలంగాణలో రూ.8. 63 కోట్లు, కర్ణాటకలో రూ. 0.71 కోట్లు, తమిళనాడులో రూ. 0.06 కోట్లు, కేరళలో రూ. 0.03 కోట్లు, ROIలో రూ. 0.07 కోట్లు వసూలు అయ్యాయని ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి.
మిరాయ్ తో పోటీ
హార్రర్-థ్రిల్లర్ జోనర్ సినిమాకు ప్రేక్షకుల మంచి స్పందన రావడం, పాజిటివ్ మౌత్ టాక్ రావడం, పాజిటివ్ రివ్యూస్ వల్ల బాక్సాఫీస్ వసూళ్లు కూడా పెరుగుతున్నాయి. చిన్న బడ్జెట్ అయిన కిష్కిందపురి సినిమా రీలీస్ మొదటి నాలుగు రోజుల్లో గ్రాస్ వసూల్లలో ₹12 కోట్లు వరకు చేరింది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ‘మిరాయ్’ కి కూడా సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం అయితే పడింది. దీంతో మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయ్యింది. మరి వీక్ డేస్ లో నిలదొక్కుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి. 5వ రోజు నుండి ఫూట్ ఫాల్ పెరిగితే మరిన్ని వసూల్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు