- Home
- Entertainment
- `కింగ్డమ్` ఫస్ట్ డే కలెక్షన్లు రివీల్ చేసిన నాగవంశీ.. ఆ తప్పులను ఒప్పుకున్న నిర్మాత
`కింగ్‌డమ్` ఫస్ట్ డే కలెక్షన్లు రివీల్ చేసిన నాగవంశీ.. ఆ తప్పులను ఒప్పుకున్న నిర్మాత
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్డమ్` మావీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు వెల్లడించారు. క్రేజీ కామెంట్స్ చేశారు.

`కింగ్డమ్` మూవీకి పాజిటివ్ టాక్
విజయ్ దేవరకొండ తాజాగా `కింగ్‌డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్, వెంకటేష్ వైపీ, రవి కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.
నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం గురువారం(జులై 31)న విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. సినిమా పెద్ద రేంజ్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో `కింగ్డమ్` మూవీ మొదటి రోజు ఏం రేంజ్‌లో వసూళ్లని రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
KNOW
`కింగ్డమ్` మొదటి రోజు కలెక్షన్లు
ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు వెల్లడించారు. తాను ఎంత ఊహిస్తున్నారో వెల్లడించారు. మొదటి రోజు ఈ మూవీ సుమారు రూ.35 కోట్ల నుంచి నలభై కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందన్నారు.
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఒక మిలియన్ దాటింది. అంటే అక్కడ ఎనిమిది కోట్లకుపైగానే వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు. ఓవర్సీస్‌లో తాను అమ్మిన అమౌంట్‌కి యాభై శాతం తొలి రోజే వస్తుందన్నారు.
అలాగే ఇక నైజాంలో ఏడున్నర కట్లు రాబట్టే అవకాశం ఉందన్నారు. ఆంధ్రాలోనూ బాగానే వస్తున్నాయన్నారు. రాయలసీమలో కూడా అమ్మిన రేటుకి యాభై శాతం మొదటి రోజునే రికవరీ అవుతుందన్నారు.
`కింగడమ్` సినిమా రిజల్ట్ పై నాగవంశీ కామెంట్
ఇలా తొలి రోజు ఈ చిత్రం సుమారు నలభై కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు నాగవంశీ. `కింగ్‌డమ్` మూవీని సుమారు రూ. 50కోట్లకు అమ్మినట్టు సమాచారం.
ఈ లెక్కన ఫస్ట్ డేనే ఇది శాతం రాబట్టే ఛాన్స్ ఉందట. మొదటి వీకెండ్‌లోనే సినిమా మొత్తం బ్రేక్ ఈవెన్ అవుతుందని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా పెద్ద రేంజ్ హిట్ అని వెల్లడించారు.
అదే సమయంలో కొన్ని తప్పులను కూడా ఒప్పుకున్నారు. సెకండాఫ్‌లో డల్‌గా ఉందని, రొమాంటిక్ సాంగ్ లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారని, ఆ విషయంలో తాము కూడా ఒప్పుకుంటున్నాని వెల్లడించారు.
విజయ్ ఫ్యాన్స్ లిప్ కిస్ మిస్సయ్యామని అంటున్నారని, అద ఎక్కడా పెట్టడానికి లేదు, అందుకే పెట్టలేకపోయామని, కథలో ఇంటెన్సిటీ అలా ఉందని, అందుకే చెడటొట్టడం ఎందుకు అని ఆ పాట పెట్టలేదన్నారు.
హాలీవుడ్ రేంజ్‌లో టెక్నీకల్‌గా `కింగ్డమ్` మూవీ
ఇంకా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ,``మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదేననే మాటలు వినిపిస్తుండటం సంతోషంగా ఉంది.
ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది.
అనిరుధ్, నవీన్ నూలి సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పని చేశారు. మేము మంచి కంటెంట్ ని అందించాము, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళడానికి మీడియా ఎంతో సపోర్ట్ చేసింది.
సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు`` అని అన్నారు.