MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పెళ్లిళ్ల వెనుక కోట్ల బిజినెస్ ? నాగ చైతన్య అడిగితే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..దిమ్మతిరిగే నిజాలు

పెళ్లిళ్ల వెనుక కోట్ల బిజినెస్ ? నాగ చైతన్య అడిగితే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..దిమ్మతిరిగే నిజాలు

నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 19 2024, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Nagarjuna

Nagarjuna

ఆరు పదుల వయసులో కూడా నాగార్జున మైంటైన్ చేస్తున్న ఫిట్ నెస్ టాలీవుడ్ లో ఇంకెవరికి సాధ్యం కాదేమో. నాగార్జున ఎప్పటికి నవమన్మధుడే అని ఫ్యాన్స్ అంటుంటారు. నాగార్జునకి సినిమా ఒక్కటే కాదు.. అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాగార్జున ఎలాంటి ఒత్తిడి తీసుకోరు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి క్లారిటీ ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫ్యామిలీ విషయంలో కూడా నాగ్ కేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

37

తమ పెళ్ళికి హాజరైతే డబ్బు ఇస్తామని తనకి చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఆఫర్ ఇచ్చినట్లు నాగార్జున రివీల్ చేశారు. అలాంటోళ్లని ఏమనాలో నాకు అర్థం కాదు. కానీ నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను.. ఎంకరేజ్ చేయను. అతిథిగా వచ్చి ఒక 20 నిమిషాలు ఉంది వెళ్ళిపోతే కళ్ళు చెదిరే మొత్తం ఇస్తామని ఆఫర్ చేశారు. 

47

ఎంత డబ్బు ఇస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం. బాలీవుడ్ స్టార్స్ అయితే కోట్లలో తీసుకుంటారు. టాలీవుడ్ వాళ్లకి 10 లక్షలు ఇస్తారా అని యాంకర్ అడగగా అది చాలా తక్కువ అని నాగార్జున అన్నారు. అయితే డబ్బు తీసుకుని పెళ్లిళ్లకు వెళ్లే స్టార్స్ ని నేను తప్పు పట్టను. నేను వెళ్ళను కానీ అది తప్పు కాదు అని నా అభిప్రాయం. హీరోకి రెండు ఫ్లాపులు వస్తే పక్కన ఉన్నవాళ్లు కూడా వెళ్ళిపోతారు. 

57

అలాంటప్పుడు క్రేజ్ ఉన్నప్పుడు డబ్బు తీసుకోవడంలో తప్పులేదు. సినిమాల్లో కూడా అంతే. నిర్మాతలు సక్సెస్ ఉన్న హీరో వెంట మాత్రమే పడతారు. ఒక సక్సెస్ పడితే బోలెడన్ని ఆఫర్స్ వస్తాయి. తన పెద్ద కొడుకు నాగ చైతన్య కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు అని నాగార్జున అన్నారు. 

 

67

నాగ చైతన్యకి ఒక సక్సెస్ రాగానే నిర్మాతలు వెంటపడ్డారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. చైతు నాకు ఫోన్ చేసి నాన్న ప్రొడ్యూసర్స్ ఇలా అంటున్నారు అని చెప్పేవాడు. అప్పుడు నాగార్జున చైతూకి సీరియస్ ఒక విషయం హెచ్చరించారట. నాగార్జున చైతుకి చెబుతూ.. నిర్మాత ఎంత డబ్బు ఇస్తున్నాడు అనేది కాదు.. ఫస్ట్ అతడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకో.. మంచివాడా కాదా అనే విషయం ఆరా తీసి ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రా అని చెప్పారట. 

77

అదే విధంగా దర్శకుడి గురించి కూడా తీసుకునే సినిమాకి ఒకే చెప్పాలని నాగార్జున చైతన్యతో అన్నారట. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అది ముఖ్యం కాదు అని నాగార్జున తెలిపారు. కొంతమంది నిర్మాతలు సినిమాపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యాపారాల్లో డబ్బు సంపాదించి వచ్చేస్తుంటారు అని నాగార్జున తెలిపారు. ఈ విషయాలన్నీ నాగార్జున ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved