- Home
- Entertainment
- జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?
జూ.ఎన్టీఆర్ 'వార్ 2' డిజాస్టర్ తో కియారా అద్వానీకి బిగ్ షాక్.. పాపం ఇలా జరిగిందేంటి ?
వార్ 2 మూవీ రిజల్ట్ తో హీరోయిన్ కియారా అద్వానీ కెరీర్ పై ప్రభావం పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కియారాకి వైఆర్ఎఫ్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిరాశపరిచిన వార్ 2
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. భారీ నష్టాలు ఎదురయ్యాయి. వార్ 2 మూవీ వైఆర్ఎఫ్ సంస్థ ప్రతిష్టని దెబ్బ తీసింది. కియారా అద్వానీకి కూడా ఈ చిత్రంతో చిక్కులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
హృతిక్, ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ వార్ 2
సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇది ఎన్టీఆర్‌కి తొలి బాలీవుడ్ ఎంట్రీగా నిలిచింది. అయితే సినిమా మొదటి మొదటి వీకెండ్ ముగియగానే కలెక్షన్లు క్షీణించడంతో, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఎన్టీఆర్ విజయాలకు బ్రేక్
సినిమా విఫలం కావడంతో ఎన్టీఆర్ విజయ పరంపరకు బ్రేక్ పడ్డట్లు అయింది. ఆయన గతంలో ఆర్ ఆర్ ఆర్, దేవర వంటి బ్లాక్‌బస్టర్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. వార్ 2 ఫలితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన కొత్త సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు.మరోవైపు హృతిక్ రోషన్ మాత్రం ఈ ఫలితాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో “ఫలితం నన్ను ప్రభావితం చేయలేదు” అని పేర్కొన్నారు.
కియారాతో కాంట్రాక్టు రద్దు ?
అయితే ఈ ఫ్లాప్ ఫలితంతో ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్నది హీరోయిన్ కియారా అద్వానీ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) సంస్థతో కియారాకు మూడు సినిమాల కాంట్రాక్ట్ ఉన్నట్టు సమాచారం. ఆమెను వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ప్రధాన మహిళా పాత్రలలో ఒకరిగా కొనసాగించాలని వైఆర్ఎఫ్ సంస్థ అనుకుంది.సినిమాలో గ్లామర్ పరంగా కూడా కియారా అద్వానీ హద్దులు పెట్టుకోలేదు. కియారా ఆమె కెరీర్‌లో తొలిసారిగా బికినీ లుక్లో కనిపించింది. కానీ సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో వైఆర్ఎఫ్ భవిష్యత్తు ప్రాజెక్టులను తిరిగి పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ సమాచారం చెబుతోంది. కియారాతో వైఆర్ఎఫ్ సంస్థ కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే తల్లి అయిన కియారా
ఇప్పుడు కియారా అద్వానీ ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్లో ఉన్నారు. ఆమె ఇటీవల తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ కారణంగా కూడా ఆమె కొత్త ప్రాజెక్టులకు కొంత విరామం తీసుకున్నారు.సమాచారం ప్రకారం, వైఆర్ఎఫ్ సంస్థ తమ స్పై యూనివర్స్లో వచ్చే ప్రాజెక్టుల కోసం కొత్త తారలను పరిగణలోకి తీసుకుంటోందట. కియారా భవిష్యత్తులో ఆ ఫ్రాంచైజ్‌లో భాగమవుతారా లేదా అన్నది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.వార్ 2 వైఫల్యం తర్వాత బాలీవుడ్‌లో పెద్ద బడ్జెట్ యాక్షన్ చిత్రాలపై ఆలోచన మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు కొత్త కథలు, భావోద్వేగాలు కోరుకుంటున్నారని నిర్మాతలు విశ్లేషిస్తున్నారు.