- Home
- Entertainment
- నా భర్తే అండగా ఉన్నాడు.. పెళ్లి తర్వాత వచ్చిన ట్రోలింగ్ పై కియారా అద్వాని కామెంట్స్..
నా భర్తే అండగా ఉన్నాడు.. పెళ్లి తర్వాత వచ్చిన ట్రోలింగ్ పై కియారా అద్వాని కామెంట్స్..
బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన పెళ్లి తర్వాత కొన్ని విమర్శలను ఎదుర్కొంది. పెళ్లి తర్వాత కూడా నటించడం ఎందుకని ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్పందించింది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో పరిచయం అయ్యింది. అటు బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’; ‘లస్ట్ స్టోరీస్’ వంటి చిత్రాలు, సిరీస్ ల్లో నటించి నార్త్ లో ఊపూపిన విషయం తెలిసిందే. దాదాపు ఇండస్ట్రీలో ఉంటూ వరుస చిత్రాలతో అలరిస్తోంది. 2014లో వచ్చిన ‘ఫగ్లీ’ మూవీతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంతో అడుగుపెట్టింది.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరోసారి చెర్రీ సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే, రెండేళ్ల ప్రేమాయణం తర్వాత కియారా అద్వానీ బాలీవుడ్ ప్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నవిషయం తెలిసిందే. జైసల్మేర్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. కాగా, పెళ్లి తర్వాత కియారా కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంది.
మ్యారేజ్ తర్వాత కూడా ఈ బాలీవుడ్ భామ సినిమాల్లో నటిస్తుండటం కొందరి నచ్చలేదు. వివాహం తర్వాత నటించడం ఎందుకు అంటూ కొందరు తనపై విమర్శలు చేశారు. దీనిపై తాజాగా కియారా స్పందించింది. ఆ సమయంలో తన భర్త ఇచ్చిన మద్దుతును చెప్పుకొచ్చింది.
ఇటీవల ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రం విజయాన్ని అందుకున్న తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది. ‘నాపై వచ్చిన ట్రోలింగ్ విషయంలో నా భర్త ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు. ధైర్యం చెప్పాడు. నెగెటివ్ వ్యక్తులను పట్టించుకోవద్దని పదేపదే చెప్తుూ వచ్చాడు. ఆయన అండగా నిలవడం నాకెంతో ధైర్యాన్నిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.