MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కెజిఎఫ్` వంటి వెయ్యి కోట్ల స్టార్‌ యష్‌ చేసిన ఫస్ట్ రీమేక్‌ మూవీ ఏంటో తెలుసా? అస్సలు ఊహించలేం

`కెజిఎఫ్` వంటి వెయ్యి కోట్ల స్టార్‌ యష్‌ చేసిన ఫస్ట్ రీమేక్‌ మూవీ ఏంటో తెలుసా? అస్సలు ఊహించలేం

`కేజీఎఫ్‌` చిత్రంతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేశాడు హీరో యష్‌. కన్నడ చిత్ర పరిశ్రమ రేంజ్‌ ఏంటో చూపించాడు. అయితే యష్‌ రీమేక్‌ సినిమాలు కూడా చేయడం గమనార్హం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 12 2024, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కళ్యాణి సినిమా

కళ్యాణి సినిమా

కన్నడ చిత్ర పరిశ్రమలోనే సంచలనం `కేజీఎఫ్‌`. ప్రశాంత్‌ నీల్‌ ఊహకు, యష్‌ ప్రాణం పోస్తే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు సంచలన విజయం సాధించి, అందరి చూపు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తిప్పుకునేలా చేశాయి. అంతకు ముందు కన్నడ సినిమాలంటే రీమేక్‌ చిత్రాలనే కామెంట్‌ ఉండేది. ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలను చాలా లేట్‌గా రీమేక్‌ చేస్తుంటారని అంటున్నారు. కానీ ఆ రూమర్స్ ని, ఆ కామెంట్లకి సమాధానం చెబుతూ `కేజీఎఫ్‌` వంటి సంచలనాన్ని తెరకెక్కించారు ప్రశాంత్‌ నీల్‌, యష్‌.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెజిఎఫ్ సినిమా

కెజిఎఫ్ సినిమా

సాధారణంగా రెండో భాగం(సీక్వెల్‌) ఫ్లాప్‌ అవుతుంటాయనే అభిప్రాయం కూడా ఉంది.  కానీ 2022లో విడుదలైన `కెజిఎఫ్ 2` ఆ అభిప్రాయాన్ని బద్దలు కొట్టింది. కెజిఎఫ్ మొదటి భాగం కంటే దాని రెండవ భాగం అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఇది బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసింది. కన్నడలోనే కాదు, తమిళం, తెలుగులో, నార్త్ లోనూ భారీ వసూళ్లని రాబట్టింది. 

 

35
కెజిఎఫ్ యష్

కెజిఎఫ్ యష్

కెజిఎఫ్ 2 చిత్రం విజయం తర్వాత 2 సంవత్సరాలు సినిమా చేయలేదు యష్. తనపై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో అలాంటి సినిమాతోనే రావాలని వెయిట్‌ చేశాడు. చివరకు `టాక్సిక్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.  ఈ చిత్రంలో హీరో యష్‌కి అక్కగా నటి నయనతార నటిస్తోంది. `టాక్సిక్` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

45
కళ్యాణి రీమేక్‌లో యష్

కళ్యాణి రీమేక్‌లో యష్

కన్నడ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన యష్, `కెజిఎఫ్` చిత్రంలో నటించడానికి ముందు 20కి పైగా చిత్రాలలో నటించారు. వాటిలో చాలా వరకు రీమేక్ చిత్రాలే. అందులో ఒకటి తమిళంలో విమల్, ఓవియా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `కళ్యాణి`(కళావాణి). ఈ చిత్రం కన్నడ రీమేక్‌లోనే  యష్ హీరోగా నటించారు. కెజిఎఫ్ వంటి మాస్ చిత్రంతో పాపులర్‌ అయిన యష్, `కళ్యాణి`(కళావాణి) వంటి చిన్న బడ్జెట్ చిత్రంలో కూడా నటించడం విశేషం. ఈ విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

55
కళ్యాణి కన్నడ రీమేక్ కిరాతక

కళ్యాణి కన్నడ రీమేక్ కిరాతక

ఈ సినిమా కన్నడలో కిరాతక పేరుతో 2011లో రీమేక్ అయ్యింది. అందులో కూడా హీరోయిన్‌గా ఓవియానే నటించడం విశేషం. ఆ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. యష్‌ ఈ రీమేక్‌ చేశాడనే విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఆ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. వీటితోపాటు యష్‌ `సుందర పాండియన్‌` అనే తమిళ మూవీని `రాజా హులి`గా రీమేక్‌ చేశారు. అలాగే `సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్` అనే సినిమాని తమిళంలో హిట్‌ అయిన `వాలు` నుంచి ఇన్‌స్పైర్‌ అయి చేశారట. ఇందులో తన భార్య రాధిక పండిట్‌ హీరోయిన్‌గా నటించడం విశేషం. యష్‌ చేసిన రీమేక్‌ చిత్రాలన్నీ బ్లాక్‌ బస్టర్స్ గా నిలవడం విశేషం. 

read more: అజిత్‌ మగాడేనా అంటూ సంచలనం రేపే కథనం, ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్ట్ కి తలా సాయం

also read: రాజమౌళిపై భయంతో లైపోసక్షన్‌ చేసుకున్న స్టార్‌ హీరో? అంతగా అవమానించాడా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved