MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ కీలాకాంశాలు, దురుద్దేశ్యపూర్వకంగానే

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ కీలాకాంశాలు, దురుద్దేశ్యపూర్వకంగానే

న్యాయస్థానం ఆయనకు 14 రోజులు (అక్టోబరు 3వరకు) జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

1 Min read
Author : Surya Prakash
Published : Sep 20 2024, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jani Master

Jani Master

జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చి సీక్రెట్ ప్లేస్ లో విచారించారు.

ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Jani Master

Jani Master


కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను ఈ రోజు  పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు (అక్టోబరు 3వరకు) జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

36
Jani Master

Jani Master

 
కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

46
Jani Master

Jani Master


‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. 

56


విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

66


ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టు నిజాలు తేలుస్తుందని జానీ మాస్టర్‌  భార్య అయేషా అలియాస్‌ సుమలత తెలిపారు.  ఈ కేసులో పోక్సో యాక్ట్‌ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని జానీ మాస్టర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. రిమాండ్‌ రిపోర్టు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Recommended image3
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved