స్వార్థపరుల చేతుల్లో సినీ కార్మికుల భూములు.. మండిపడ్డ నిర్మాత!

First Published Aug 7, 2019, 4:36 PM IST

ప్రముఖ దర్శకనిర్మాత, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్ బాస్ 3 షో ప్రారంభానికి ముందు అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ని రద్దు చేయాలంటూ కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కేతిరెడ్డి మరో ఉద్యమాన్ని తన భూజాల మీద వేసుకున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికులకు కేటాయించిన భూముల అవినీతి విషయంలో కేతిరెడ్డి నిరసన చేపట్టారు. 

1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనిలో 67 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

ఈ భూముల కోసం ఏపీ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పడింది. నిరుపేదలైన సినీ కార్మికులకు ఈ కమిటీ సభ్యులు ఈ భూముల్లో గృహ వసతిని ఏర్పాటు చేసేవారు.

ఆ తర్వాత జరిగిన అవినీతిలో ఈ భూములని కొందరు ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించారు. దీనిపై సినీ కార్మికులు గత 50 రోజులుగా నిరసన చేపడుతున్నారు.

కేతిరెడ్డి బుధవారం రోజు ప్రెస్ క్లబ్ కు వెళ్లి సినీ కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపారు. 94లో చిత్ర పరిశ్రమలు ప్రభుత్వం భూమిని కేటాయించడంలో తాను కుఆ కీలక పాత్ర వహించానని కేతిరెడ్డి అన్నారు.

తాము సినీ కార్మికుల కోసం ఎంతో కష్టపడి ఈ భూములని సినీ కార్మికుల కిశోరం ప్రభుత్వం నుంచి రాబట్టాం. కానీ కొందరు స్వార్థపరులు కబ్జా చేసి ఈ భూములని అనుభవిస్తున్నారు అని కేతిరెడ్డి మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా సంఘీభావం తెలిపారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?