పార్టీలో భర్తతో డ్యాన్స్ అదరగొట్టిన కీర్తి సురేష్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
గత ఏడాది డిసెంబర్ లో కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కీర్తి సురేష్, తన భర్త ఆంటోనీతో పార్టీలో పాల్గొంది.

సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వేడుకల ఫొటోలను షేర్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కీర్తి సురేష్, తన భర్త ఆంటోనీతో పార్టీలో పాల్గొంది. ఈ ఈవెంట్ కోసం కీర్తి మెరిసే గ్రీన్ గౌన్‌ను వేసుకుంది. స్మోకీ ఐస్‌తో చాలా అందంగా ఉంది.
కీర్తి తన భర్త ఆంటోనీ థట్టిల్‌తో కలిసి పార్టీకి వచ్చింది. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.కీర్తి సురేష్ భర్త ఆంటోని వ్యాపారంలో రాణిస్తున్నారు.
సోషల్ మీడియాలో పిక్స్‌ను షేర్ చేస్తూ.. పెళ్లి తర్వాత పార్టీలో బాగా డ్యాన్స్ చేశామని కీర్తి చెప్పింది.
హిందుస్థాన్ టైమ్స్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందని కీర్తి చెప్పింది.కీర్తి సురేష్, ఆంటోని స్కూల్ వయసు స్నేహితులుగా ఉన్నారు.
పెళ్లి తర్వాత తమపై ప్రజల దృష్టి ఎక్కువైందని కీర్తి చెప్పింది. ఆంటోనీకి ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్ అని తెలిపింది.
పెళ్లి తర్వాత తమ కుటుంబాలు ఒక్కటయ్యాయని, ఇది చాలా ప్రత్యేకమైన జర్నీ అని కీర్తి చెప్పింది.తెలుగులో కీర్తి సురేష్ మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకుంది.
ఆంటోనీతో తన రిలేషన్ షిప్ అలాగే ఉందని, ఇరు కుటుంబాల మధ్య బంధం ఏర్పడటం సంతోషంగా ఉందని తెలిపింది. తన భర్తతో కీర్తి సురేష్ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
కుటుంబ సభ్యులు కలిసి ఉండటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉందని కీర్తి చెప్పింది.మహానటితో పాటు కీర్తి సురేష్ అనేక తెలుగు చిత్రాల్లో నటించింది.
కీర్తి సురేష్ చివరగా బేబీ జాన్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్, వామికా గబ్బి కూడా ఉన్నారు. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి నటనను చూడొచ్చు.కీర్తి సురేష్ నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.