- Home
- Entertainment
- హాట్నెస్ ని పరిచయం చేస్తున్న హోమ్లీ బ్యూటీ కీర్తి... దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్
హాట్నెస్ ని పరిచయం చేస్తున్న హోమ్లీ బ్యూటీ కీర్తి... దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ కూడా మారిపోయింది. తనలోని గ్లామరస్ యాంగిల్ పరిచయం చేస్తూ సరికొత్తగా తోస్తుంది. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది.

Keerthy Suresh
కీర్తి సురేష్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. వరుస చిత్రాలతో అమ్మడు ఊపిరి సలుపుకోలేంత బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి అరడజను సినిమాలు చేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Keerthy Suresh
ఇటీవల విడుదలైన తమిళ చిత్రం మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నాయకుడిగా విడుదలైంది. ఈ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించింది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ మార్కెట్ లేదు. అందుకే పెద్దగా ఆడలేదు.
Keerthy Suresh
కాగా కీర్తి సురేష్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టింది. సర్కారు వారి పాట, దసరా భారీ విజయాలు నమోదు చేశాయి. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా బిగ్గెస్ట్ హిట్.
Keerthy Suresh
స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ సిస్టర్ రోల్స్ కి వెనకాడటం లేదు. సాధారణంగా హీరోయిన్స్ చెల్లెలు పాత్రలు చేస్తే కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.
Keerthy Suresh
ప్రస్తుతం పలు భాషల్లో అరడజను సినిమాల వరకు కీర్తి చేస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారని సమాచారం. ఒకప్పుడు సినిమాకు రెండు కోట్లు తీసుకున్న కీర్తి రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అలాగే కీర్తి రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Keerthy Suresh
కీర్తి పాలిటిక్స్ లో వస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి ఆసక్తికరంగా స్పందించారు. వెంటనే రాకపోయినా భవిష్యత్తులో వచ్చే ఆలోచన ఉన్నట్లు ఆమె కామెంట్స్ ఉన్నాయి. ఇక కీర్తి పెళ్లిపై పలు రూమర్స్ ఉన్నాయి.
Keerthy Suresh
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ కూడా మారిపోయింది. తనలోని గ్లామరస్ యాంగిల్ పరిచయం చేస్తూ సరికొత్తగా తోస్తుంది. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది.